Reading Time: < 1 minute
Ipl 2026 Bcci Note On Bengaluru Matches Chinnaswamy Stadium Clearance

IPL 2026: బీసీసీఐ తాజాగా ఈ సీజన్‌కు సంబంధించి ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. ఇక్కడ ఓ బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది. గతేడాది ఆర్సీబీ విజయం అనంతరం.. అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత స్టేడియంలో మ్యాచ్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎత్తివేసినప్పటికీ తాజాగా ఐపీఎల్ షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక నోట్ ఉంచింది. బెంగళూరులో మ్యాచ్‌లు జరగడం అనేది పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చే క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. “బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి. ఈ కమిటీ మార్చి 13, 2026న ఎం. చిన్నస్వామి స్టేడియంలో సమావేశం, తనిఖీని నిర్వహిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి స్టేడియం సంసిద్ధతను అంచనా వేయడానికి మ్యాచ్-డే ఏర్పాట్ల పూర్తి స్థాయి మాక్ ప్రదర్శన నిర్వహింస్తారు.” అని బీసీసీఐ నోట్‌లో ప్రకటించింది. ఇక ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లను రెండు వేర్వేరు నగరాల్లో ఆడనుంది. బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం)లో 5 హోమ్ మ్యాచ్‌లు, రాయ్‌పూర్ (షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం)లో 2 హోమ్ మ్యాచ్‌లు ఆడనుంది.

READ MORE: AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!