July 10, 2026

జనగణనపై జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో శిక్షణ… సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి కీలక వ్యాఖ్యలు..

జనగణనపై జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో శిక్షణ... సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి కీలక వ్యాఖ్యలు..
Reading Time: < 1 minute

జనగణనపై జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో శిక్షణ… సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి కీలక వ్యాఖ్యలు..

Caption of Image.

హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సెన్సస్ 2027 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ( మార్చి 11 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి. జనగణనలో ఒక్కరిని కూడా వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని అధికారులకు నాసూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న జనాభా వాస్తవంగా ప్రతిబింబించేలా సర్వే చేయాలని ఆదేశించారు.

అభివృద్ధి ప్రణాళికలు, పాలసీల రూపకల్పనలో క్వాలిటీ సెన్సెస్ డేటా కీలకమని.. ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు హౌస్ లిస్టింగ్ అండ్ హౌజింగ్ సెన్సెస్ పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సెన్సెస్-2027 రెండు దశల్లో నిర్వహించాలని..మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన ఉంటుందని..రెండో దశలో జనాభా గణనయూ ఉంటుందని అన్నారు. మొదటి దశ పకడ్బందీగా నిర్వహిస్తే రెండో దశ సజావుగా సాగుతుందని అన్నారు భారతీ హోళికేరి.

సర్వేలో డిజిటల్ టూల్స్ వినియోగంపై అధికారులు ఫోకస్ పెట్టాలని.. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు సరైన మార్గదర్శనం ఇవ్వాలని సూచించారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ..

జనగణనలో ఒక్క హౌస్ హోల్డ్ కూడా మిస్ కాకూడదని అన్నారు. కుటుంబాల వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా నాణ్యమైన డేటా సేకరణ చేయాలని సూచించారు. మొదటి దశలో ఇంటి పరిస్థితులు, ఇంట్లోని సౌకర్యాలపై సమాచారం సేకరించాలని..రెండో దశలో ప్రతి వ్యక్తి జనాభా, సామాజిక, ఆర్థిక వివరాల నమోదు చేయాలని అన్నారు.

►ALSO READ | సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్.. పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. పది తులాల బంగారంతో పరార్… 

©️ VIL Media Pvt Ltd.