బలహీనపడ్డ డాలర్.. రూ.11 వేలు పెరిగిన వెండి Caption of Image.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటంతో ఢిల్లీలో మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. కిలో వెండి ధర రూ.10,975 ఎగబాకి రూ.2.79 లక్షల మార్కును చేరింది. క్రితం సెషన్లో రూ.2.68 లక్షలుగా ఉన్న వెండి ధర 4.09 శాతం పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.400 వృద్ధి చెంది రూ.1.64 లక్షల వద్ద స్థిరపడింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అమెరికా అధ్యక్షుడి ప్రకటన, ముడి చమురు ధరల తగ్గుదల ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేశాయి.