July 10, 2026

T20 World Cup Trophy: వరల్డ్ కప్ ట్రోఫీ ‘పబ్లిక్ ప్రాపర్టీ’ అయిందా?.. ఆటగాళ్ల ఫ్యామిలీ, లవర్స్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్! 

T20 World Cup Trophy: వరల్డ్ కప్ ట్రోఫీ ‘పబ్లిక్ ప్రాపర్టీ’ అయిందా?.. ఆటగాళ్ల ఫ్యామిలీ, లవర్స్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్! 
Reading Time: 2 minutes

T20 World Cup Trophy: వరల్డ్ కప్ ట్రోఫీ ‘పబ్లిక్ ప్రాపర్టీ’ అయిందా?.. ఆటగాళ్ల ఫ్యామిలీ, లవర్స్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్! 

Caption of Image.

T20 World Cup Trophy: టీ20 ప్రపంచకప్ 2026 ట్రోఫీ వివాదం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. భారత జట్టు టైటిల్ గెలిచిన తర్వాత ట్రోఫీతో తీసుకున్న కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భారత్ గెలిచిన తర్వాత ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ట్రోఫీతో ఫోటోలు దిగిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో ఇంత విలువైన ట్రోఫీని ఎందుకు ఇంతమందికి అందిస్తున్నారు? అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. మాజీ భారత క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సూర్యకుమార్ యాదవ్ తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు చేశారు.

సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన తర్వాత ట్రోఫీని అధికారిక కార్యక్రమంలో జట్టు కెప్టెన్‌కు అందజేస్తారు. అనంతరం ఆటగాళ్లు, జట్టు సభ్యులు కలిసి వేదికపై ట్రోఫీని ఎత్తి సంబరాలు జరుపుకుంటారు. సాంప్రదాయంగా ఈ ట్రోఫీని జట్టు ప్లేయర్స్, అధికారిక సభ్యులు మాత్రమే పట్టుకోవాలి.. కానీ ఈసారి ట్రోఫీ అనేక మంది చేతుల్లోకి మారిందనే భావన అభిమానుల్లో కలిగింది. దీంతో ట్రోఫీ నిర్వహణ బాధ్యత సాధారణంగా టోర్నమెంట్ నిర్వాహకులు, మ్యాచ్ అధికారులు, విజేత జట్టు మేనేజ్‌మెంట్ దగ్గర ఉంటుంది. అధికారిక కార్యక్రమం పూర్తైన తర్వాత ట్రోఫీని భద్రంగా ఉంచడం వారి బాధ్యత.. మ్యాచ్  విజయం సాధించిన రెండు రోజులకే అనేక మంది ట్రోఫీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

►ALSO READ | Hardik Pandya: హార్దిక్ కుటుంబంలో చిచ్చు పెట్టిన మహికా శర్మ.. విడిపోతున్న పాండ్యా బ్రదర్స్..?

సూర్యకుమార్ యాదవ్ తన భార్యతో కలిసి ట్రోఫీని మధ్యలో పెట్టుకుని నిద్రిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా,  తిలక్ వర్మ ట్రోఫీని చేతిలో పట్టుకుని నిద్రలేచి పళ్లును తోముతున్నట్లు వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. అర్ష్ దీప్ సింగ్ బావ ట్రోఫీతో ఫోటో దిగడంతో పాటు శుభ్‌మన్ గిల్ ఫ్యామిలీ, అభిషేక్ శర్మ సోదరి ట్రోఫీతో దిగిన ఫోటోలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఐసీసీ ట్రోఫీకి విలువ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీ ‘పబ్లిక్ ప్రాపర్టీ’ అయిందా? అని నెట్టింట క్వశ్చన్ చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.