
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యాణేష్ కుమార్ కు కోల్కతాలో నిరసన సెగ తగిలింది. సోమవారం ( మార్చి 9 ) కోల్కతాలోని కాళీఘాట్ ను సందర్శించేందుకు వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా పలువురు నల్లజెండాలతో సీఈసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాళీఘాట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బెంగాల్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన గ్యాణేష్ కుమార్ ఆదివారం రాత్రి కోల్కతా చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్పోర్టు దగ్గర కూడా ఆయనకు ఇదే తరహా నిరసన సెగ తగిలింది. కోల్కతా ఎయిర్పోర్టులో గ్యాణేష్ కుమార్ కు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు టీఎంసీ కార్యకర్తలు. ఆయన కాన్వాయ్ వెళ్తున్న దారిలో నల్లజెండాలతో నిరసన తెలిపారు. టీఎంసీకి తోడు వామపక్ష పార్టీలు కూడా ఎయిర్పోర్టు బయట నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
VIDEO | West Bengal: Protesters show black flag, raising ‘Go back’ slogans as Chief Election Commissioner Gyanesh Kumar arrived in Kolkata on a three-day visit for the EC’s full bench meeting to review the preparations for the West Bengal assembly elections.
(Full video… pic.twitter.com/cutCvEFgSy
— Press Trust of India (@PTI_News) March 8, 2026
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు మూడు పర్యటనలో భాగంగా కోల్కతా చేరుకున్నారు సీఈసీ. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కూడా ఈ పర్యటనలో ఉన్నారు.