Reading Time: < 1 minute

బెంగళూరులో హోటళ్లు బంద్.. గ్యాస్ ధరల పెంపుపై యజమానుల నిరసన!

Caption of Image.

హోటల్స్ లో వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ, బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్ మంగళవారం హోటళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మద్దతు తెలిపారు.

 హోటళ్లకు సప్లయ్  చేసే గ్యాస్ సిలిండర్లను అకస్మాత్తుగా నిలిపివేయడంపై హోటల్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 70 రోజుల వరకు సప్లయ్ ఇబ్బంది ఉండదని కంపెనీలు చెప్పినప్పటికీ, సోమవారం నుంచే గ్యాస్ రావడం ఆగిపోయిందని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సి. రావు తెలిపారు.

 కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.115 పెంచడం వల్ల హోటల్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో పడిందని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. అందుకే ఈ బంద్ పిలుపు సరైనదేనని ఆయన అన్నారు.  కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సప్లయ్  పునరుద్ధరించాలని హోటల్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. హోటళ్లు మూసివేయడం వల్ల  వీటి పై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.