Reading Time: 2 minutes
Team India Visits Hanuman Temple After T20 World Cup Win Suryakumar Gambhir

Ahmedabad: భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్‌ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించారు. ఈ కప్పులు కెప్టెన్ సూర్యకుమార్ అందుకోగానే హనుమాన్ ఆలయానికి పరుగులు తీశాడు. ఈ విజయం సాధించిన వెంటనే అర్ధరాత్రి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జయ్ షా కలిసి అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ కప్ ట్రోఫీతో వెళ్లి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ అనంతరం దేవుడి దయ వల్లే గెలిచామని సూర్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

READ MORE: Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయమే ఆ జట్టు కొంపముంచింది. బ్యాటింగ్ బరిలోకి దిగిన టీమిండియా చెలరేగింది. అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ అద్భుతంగా రాణించారు. గత కొన్ని మ్యాచుల్లో ఫామ్‌పై విమర్శలు వస్తున్నప్పటికీ ఫైనల్‌లో మాత్రం చెలరేగాడు అభీ.. కేవలం 21 బంతుల్లో 52 పరుగులు స్కోర్ చేశాడు. విమర్శకుల నోటికి తాళం వేశాడు. ఇక సంజూ 89 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్‌ దూకుడుగా ఆడుతూ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు కేవలం 16 ఓవర్లలోనే రెండు వందల పరుగుల మార్క్ దాటింది. చివరి ఓవర్లలో శివం దూబే వేగంగా పరుగులు చేసి జట్టుకు మరింత బలం చేకూర్చాడు. మొత్తంగా భారత్ ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక పరుగులుగా నిలిచింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ 159 పరుగుకే కుప్పకూలింది.

READ MORE: Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్