
హైదరాబాద్: రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. విద్యారంగంపై రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఇచ్చిన నివేదిక అసంబద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరితోనూ చర్చికుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక ఇచ్చారని విమర్శించారు. ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటి? అని.. ఉపాధ్యాయులకు జీతాలు తగ్గిస్తే.. విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? అని బండి ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి కూడా లేరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.