Reading Time: < 1 minute

నిజాయితీగల నేతలే గోవా ప్రజలకు కావాలి : ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్

Caption of Image.
  • ఆప్ చీఫ్​ అర్వింద్ కేజ్రీవాల్

పణజి: గోవా ప్రజలు నిజయతీతో కూడిన ప్రజా కేంద్రీకృత రాజకీయాలను కోరుకుంటున్నారని ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీ ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే దిశగా నిరంతరం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గోవాలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు శనివారం స్థానిక  యూనిట్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. “నేడు గోవా స్టేట్ కమిటీ సభ్యులతో కలిసి లంచ్ మీటింగ్​లో పాల్గొన్నాను.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించాం. గోవా ప్రజలు నిజయతీ, ప్రజా కేంద్రీకృత రాజకీయాలను కోరుకుంటున్నారు. ప్రజలతో కలిసి గోవా ఆకాంక్షలను నెరవేరుస్తాం” అని పేర్కొన్నారు. ఇటీవల గోవాలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆప్ తీవ్ర పరాజయాన్ని చవి చూసింది. 

©️ VIL Media Pvt Ltd.