
ప్రస్తుతం యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇందులో ఓ పిలగ వెంకటి. ఈ పాట సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. అయితే ఈ పాటలో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది డ్యాన్సర్ పూజ నాగేశ్వర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రజలు తనను గుర్తుపట్టడం, నార్మల్ పూజ నుంచి పూజారా అనే స్థాయికి రావడాన్ని చాలా ఉత్సాహంగా, కొత్తగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు లేదా షాపింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు తనను గుర్తించినప్పుడు కలిగే ఆనందం ప్రత్యేకమైనదని ఆమె వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..
పూజ నాగేశ్వర్ తన కెరీర్ మొదలుపెట్టడానికి వల్లీ సర్ అనే వ్యక్తి మొదటి అవకాశాన్ని కల్పించారని తెలిపారు. తెరి మేరి కథ పాట తన మొదటి ప్రాజెక్ట్ అని, ఆ పాట ప్రొడ్యూసర్ వల్లీ సరేనని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, తెరి మేరి కథ పాటలోని కొన్ని చరణాలను ఆలపించి, తన గాత్ర మాధుర్యాన్ని కూడా చాటారు. అయితే, ప్రొఫెషనల్‌గా గాయనిగా మారే ఆలోచన లేదని, గాయకులను చిన్నబుచ్చడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు. ఓ పిల్లగా వెంకటి పాట తనకు బ్రేక్ ఇచ్చి, విశేష గుర్తింపు తెచ్చిపెట్టిందని పూజ నాగేశ్వర్ తెలిపారు. ఈ పాట రాకముందు కూడా ఆమె దాదాపు 45-50 పాటలకు డ్యాన్స్ చేశారని, వాటిలో చాలావరకు ఫోక్ హిట్స్‌గా నిలిచాయని పేర్కొన్నారు. ఓ పిల్లగా వెంకటి బాగా వైరల్ కావడంతో తన పేరు ప్రఖ్యాతులు మరింత విస్తరించాయని ఆమె చెప్పారు. ఇప్పటివరకు ఆమె 60కి పైగా పాటలకు డ్యాన్స్ చేశానని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
కేవలం 18 ఏళ్ల వయసులో, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న పూజ నాగేశ్వర్, తన చదువు, షూటింగ్‌లను సమన్వయం చేసుకుంటున్న తీరు అబ్బురపరుస్తుంది. 10వ తరగతి పూర్తయిన వెంటనే షూటింగ్‌లు ప్రారంభించిన ఆమె, ఇంటర్మీడియట్ చదువును కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి ఇర్రెగ్యులర్ విద్యార్థినిగా కొనసాగించారు. అదే విధంగా డిగ్రీలో కూడా కొనసాగాలని కాలేజీలో చర్చలు జరిపారు. ఇంటర్ సమయంలో, ఓ పిల్లగా వెంకటి పాట తర్వాత ఆమెకు వచ్చిన గుర్తింపుతో, కాలేజీలోని అమ్మాయిలు ఆమెను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తించేవారని, బ్రేక్ టైమ్‌లో ఆమె క్లాస్‌రూమ్ దగ్గరకు వచ్చి చూసి వెళ్లేవారని పంచుకున్నారు. ఆమె చదివింది ఉమెన్స్ కాలేజీ అని తెలిపారు. డిగ్రీలో ఎలా ఉంటుందో చూడాలి అని ఆసక్తిగా చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..