Reading Time: < 1 minute
Hansika Motwani Comments On Casting Couch Controversy Interview

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్ హన్సిక, సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం ‘క్యాస్టింగ్ కౌచ్’పై స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ పోరాడుతుంటే, హన్సిక మాత్రం సింపుల్ గా ‘నాకైతే తెలియదు’ అని దాటవేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : Alia Bhatt: పాకిస్థానీ బ్రాండ్‌కు అలియా భట్ ప్రచారం? నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించగా.. హన్సిక మాట్లాడుతూ.. ‘నిజంగా పని చేయలని మనస్ఫూర్తిగా అనుకునే వారికి, నిజమైన టాలెంట్ ఉన్న వారికి ఇలాంటివి ఎదురవుతాయని నేను అనుకోను. నా విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అని చెప్పుకొచ్చింది. పరిశ్రమలో ఇలాంటివి జరుగుతున్నాయన్నది వాస్తవం కదా అని హోస్ట్ గుర్తూ చేసినా కూడా.. ‘దాని గురించి నాకు అవగాహన కూడా లేదు, కాబట్టి నేను కామెంట్ చేయలేను’ అని ఆమె ఆ విషయాన్ని విస్మరించింది. ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..

నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘మీకు డయబెటీస్ లేనంత మాత్రాన, అసలు ఆ వ్యధే లేదని చెప్పడం ఎంత ముర్ఖత్వమో మీ మాటలు కూడా అలాగే ఉన్నాయి’ అని ఒక యూజర్ ఘాటుగా స్పందించారు. అంతే కాదు టాలెంట్ ఉంటే ఇలాంటివి జరగవు అని అనడం ద్వారా, బాధితులను హన్సిక అవమానిస్తోందని మరికొందరు మండిపడుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఒక రక్షణ వలయంలో ఉండటం వల్లే హన్సికకు బయటి ప్రపంచం తెలియడం లేదని విమర్శలు వస్తున్నాయి.