Reading Time: < 1 minute
A Karunakaran Bellamkonda Ganesh New Movie Launch Updates

టాలీవుడ్‌లో ప్రేమకథలకు సరికొత్త అర్థం చెప్పిన దర్శకుడు ఏ. కరుణాకరన్ మళ్లీ మెగాఫోన్ పట్టారు. ‘తొలిప్రేమ’, ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన, చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టడం విశేషం. యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ప్రధాన పాత్రలో, గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మౌనిక రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.

Also Read : Anasuya Bharadwaj : అసభ్య పోస్టులతో అనసూయకు వేధింపులు: యువకుడి అరెస్ట్ !

ఈ సినిమాకు తన క్లాసిక్ లవ్ స్టోరీలతో ప్రేక్షకులను మాయ చేయడంలో దిట్ట అయిన ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఆయన మార్క్ చమత్కారం, వినూత్నమైన కామెడీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. అనుదీప్ కేవీ స్వయంగా స్క్రిప్ట్‌ను అందజేసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.