Reading Time: 2 minutes
జబర్దస్త్‌లో 180 ఎపిసోడ్స్ చేశా.. ఇప్పుడు అవకాశాలు లేవు.. ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇలా..

ప్రఖ్యాత నటుడు తిరుపతి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించాడు అంతే కాదు జబర్దస్త్ లాంటి కామెడీ షోలో స్కిట్స్ చేసి నవ్వులు పూయించాడు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన ఆతర్వాత  అవకాశాలు తగ్గడంతో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చాలా కాలంగా సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉంటున్న ప్రకాష్ ఇప్పుడు ఎం చేస్తున్నాడా అని పలువురు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంటర్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ప్రకాష్ మాట్లాడుతూ.. సినిమాలు తగ్గాయి, జబర్దస్త్ లో2015 నుండి 2018 వరకు, దాదాపు 180 ఎపిసోడ్‌లు పూర్తయిన తర్వాత ఏమి చేయాలి?” అనే ప్రశ్న ఎదురైందని చెప్పారు. దర్శకులు కలవరు, ఇంటర్వ్యూలు లభించవు అలాంటి పరిస్థితులలో తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయన్నారు.

మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు

దీని స్ఫూర్తితోనే తాను స్వయంగా ఓ కాఫీ పౌడర్ షాప్ ఓపెన్ చేశా అని తెలిపారు. అంతే కాదు తానే స్వయంగా దుకాణాన్ని ఊడ్చి, శుభ్రం చేసి, తెరచి, మూసేస్తానని వివరించారు. ఒక పెద్ద స్టార్ హోటల్‌ను ప్రారంభించేంత స్థోమత లేదని, తన సామర్థ్యానికి తగ్గ వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాష్ తెలిపారు. మొదట టిఫిన్ సెంటర్ లేదా కిరాణా షాప్ పెట్టాలని అనుకున్నా.. వంట రాకపోవడం, సరుకులు సరఫరాపై అవగాహన లేకపోవడంతో ఆ ఆలోచనలను విరమించుకున్నా అని తెలిపారు. ఇక కాఫీ పొడి వ్యాపారం ఆలోచన మణికొండలోని తన బంధువుల నుండి వచ్చింది. అమీర్‌పేట్ లేదా మోతీ నగర్‌కు వెళ్లి కాఫీ పొడి తెచ్చుకునే బదులు, మణికొండలో అలాంటి దుకాణం లేదని గ్రహించినప్పుడు, అదే ఒక అవకాశంగా తోచిందని వివరించారు. చంద్ర కాఫీ వర్క్స్ యజమాని సహాయంతో, 60:40 కాఫీ మిశ్రమం రహస్యాలను తెలుసుకుని, 2019 ఏప్రిల్ 11న మణికొండలో తన కాఫీ పొడి షాపును ప్రారంభించా అని తెలిపారు.

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు

ప్రారంభంలో, సినీ నటుడైన ప్రకాష్ కాఫీ షాపు పెట్టడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారని ఆయన గుర్తు చేసుకున్నారు. “సార్, సినిమాలు లేవా?” అని అడిగినప్పుడు, “సినిమాలు లేవండి, టైమ్‌పాస్ కోసం పెట్టాను” అని సమాధానం ఇచ్చేవారట. కోవిడ్ వరకు తన జేబులో నుండే పెట్టుబడి పెట్టి, అద్దెలు చెల్లించానని చెప్పారు. కేవలం 5 కిలోల కాఫీ గింజలు, 3 కిలోల చిక్కోరీతో ప్రారంభించి, ప్రస్తుతం 1200 నుంచి 1300 మంది కస్టమర్లను కలిగి ఉన్నానని ఆయన సంతోషంగా తెలిపారు. బయటి వారు తన గురించి ఏమి అనుకున్నా తనకు అనవసరమని, తాను ఎలా వచ్చానో సినీ పరిశ్రమకు, ఈరోజుకీ అలాగే ఉన్నానని, ఎవరి ముందు చెయ్యి చాచలేదని దృఢంగా చెప్పారు. కష్టాల్లో ఉన్న అసోసియేట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ మేనేజర్‌లకు ఇప్పటికీ సహాయం అందిస్తుంటానని ఆయన తెలిపారు.

ఆయన్ని ఇలా చూస్తే ప్రాణం చివ్వుక్కుమంది..! నడవలేని స్థితిలో లెజెండ్రీ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.