Reading Time: 2 minutes
Anchor Ravi: ఆ లేడీ యాంకర్ నా ఎదుగుదలను ఓర్వలేకపోయింది.. నాపై చేతబడి చేయించింది.. యాంకర్ రవి సంచలన వ్యాఖ్యలు

యాంకర్ రవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న అతను పలు టీవీ షోలకు, ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా, హోస్ట్ గా వ్యవహరించాడు. పటాస్, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, కిర్రాక్ , అలీ టాకీస్ తదితర టీవీ ప్రోగ్రామ్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. యాంకర్ రవి కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది  అభిమానులు ఉన్నారు. వీటితో పాటు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నాడు యాంకర్ రవి. ఐదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. విజేతగా నిలవకున్నా తన దైన ఆట, మాట తీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. కేవలం బుల్లితెరపైనే కాదు అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తున్నాడు రవి.  తాజాగా అతను ఓ టాక్ షోకు హాజరయ్యాడు. తన  పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో  తనతో పనిచేసిన ఓ లేడీ యాంకర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 

‘ నా 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో టీవీ ఛానెల్స్‌లో పనిచేశాను. ఎన్నో ప్రోగ్రామ్స్, షోలు చేశాను. రికార్డులు క్రియేట్ చేశాను. కానీ చివరికి ‘వాట్ నెక్స్ట్?’ అనే ప్రశ్నే వస్తుంది. నేను ఎదుగుతున్న సమయంలో చాలామంది తొక్కేయాలని ప్రయత్నించారు. వెన్నుపోట్లు అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్. అసలు మనుషులంటేనే వెన్నుపోటు. నా ఎదుగుదల చూడలేక నా బ్యాచ్‌లో ఉన్న ఓ లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓ వ్యక్తితో చేతబడి పూజలు చేయించింది. కానీ ఆమెపై నాకు ఏ మాత్రం కోపం రాలేదు. నేను దేవుడి దగ్గరకు వెళ్లి ఆమె చల్లగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. నేను ఎవరి దృష్టిలో తప్పు చేసి ఉండొచ్చు. కానీ నా మనస్సాక్షికి నేను కరెక్ట్ అనిపిస్తే అదే చాలు. అలాగే కొంత మంది యాంకర్లు ‘అతనితో మేము షోలు చేయం’ అని ఓపెన్‌గా చెప్పిన సందర్భాలున్నాయని. నేను అదృష్టాన్ని కాదు, కష్టాన్ని నమ్ముతాను. సినిమా రంగంలోనే కాదు ఎక్కడైనా టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి’ అని చెప్పుకొచ్చాడు యాంకర్ రవి.

భార్యా బిడ్డలతో యాంకర్ రవి..

 

View this post on Instagram

 

A post shared by Ravi Kiran (@anchorravi_offl)

ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు యాంకర్ రవి. ‘బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి హౌస్ లోకి రావాలని నాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే మొదటి నాలుగు సీజన్లకు నేను ఒప్పుకోలేదు. ఐదో సీజన్‌కు ఎక్కువ మొత్తం అడిగి తప్పించు కోవాలనుకున్నా. కానీ వాళ్లు ఒప్పుకున్నారు. అందుకే వెళ్లాల్సి వచ్చింది. బిగ్ బాస్ షోలో చూపించేదంతా నిజం కాదు. టీవీలో టెలికాస్ట్ అయ్యేది రోజుకు కేవలం ఒక గంట మాత్రమే.. కానీ అది పూర్తిగా నిజం కాదు. ప్రేక్షకులు చూసేదానికి.. బిగ్ బాస్ హౌస్ లో నిజంగా జరిగే దానికి చాలా తేడా ఉంటుంది. బిగ్‌బాస్‌లో ఎవరైనా నేను నటించలేదు అంటే చెప్పుతో కొట్టాలి. కెమెరాలు ఉన్న చోట అందరూ నటిస్తారు’ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు రవి.

 

View this post on Instagram

 

A post shared by Ravi Kiran (@anchorravi_offl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.