
దర్శకుడు శ్రీను వైట్ల.. ఇప్పుడంటే పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ ఒకప్పుడు శ్రీను వైట్లకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. మహేష్ బాబు దూకుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. కంటెంట్ ఏదైనా సరే తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు శ్రీను వైట్ల. ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ఆనందం. ఆనందం విడుదలై చిత్రం 25 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా చాలా మంది ఫేవరెట్. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమా నిర్మాణ అనుభవాలు, సవాళ్లు, అనూహ్య విజయం వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు.
మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు
ఆనందం నాన్-కాస్టింగ్ చిత్రంగా, తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కింది. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ వస్తాయా అని శ్రీను వైట్ల ఆందోళన చెందారట. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ ఆయనకు ధైర్యం చెప్పారని తెలిపారు. చిత్ర బృందం వైజాగ్‌లోని శ్రీనగర్ కాలనీ ఆలయంలో పూజలు చేసి, ట్యాంక్ బండ్ చేరుకునే సరికి, మయూరి సుధాకర్ గారు ఆంధ్రప్రదేశ్ అంతటా సినిమాకు భారీ స్పందన లభించిందని, థియేటర్ల వద్ద జనం పోటెత్తారని తెలియజేశారని తెలిపారు శ్రీను వైట్ల. మయూరి థియేటర్ ఒక్క దాని షేర్‌తోనే సినిమా బడ్జెట్ తిరిగి వచ్చిందంటే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థమవుతుంది అని శ్రీను వైట్ల తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ సినిమాను ఎంతగానో అభినందించారని శ్రీను వైట్ల గుర్తు చేసుకున్నారు.
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు
ఆనందం కథా నేపథ్యం కూడా ఆసక్తికరంగా సాగిందట.. ఒక రాత్రి మెరుపులా తట్టిన ఆలోచనను మూడు రోజుల్లో 80 సీన్లుగా అభివృద్ధి చేసి, అజయ్ శాంతి ద్వారా రామోజీ రావు గారికి వినిపించారట. కథ విన్న రామోజీ రావు గారు ఒక్క మార్పు కూడా సూచించకుండా, “గో అహెడ్” అని వెంటనే ఆమోదం తెలిపారట. ముహూర్తాలపై నమ్మకం లేని ఆయన, “ఒక చెడ్డ రోజు చూసి స్టార్ట్ చేయండి, ఎందుకు హిట్ అవ్వదో చూద్దాం” అని చెప్పిన మాట శ్రీను వైట్ల ఎప్పటికీ మర్చిపోలేరు. రామోజీ రావు 60 రోజుల షూటింగ్ షెడ్యూల్ ఇచ్చినా, శ్రీను వైట్ల కేవలం 42 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశారట. ఇందులో 19 రోజులు టాకీ పార్ట్, 23 రోజులు పాటల చిత్రీకరణ జరిగిందట. సినిమా సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఆనందం ద్వారా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. సినిమాలోని హాస్యం, ముఖ్యంగా రాంబాబు కామెడీ ట్రాక్ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఎవరైనా ఎప్పుడైనా పాట, సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలగలిసి ఒక సానుకూల జీవన దృక్పథాన్ని తెలియజేస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ఆనందం కేవలం ఒక లవ్ స్టోరీగానే కాకుండా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.