
నయనతార మునుపటిలా .. ఇప్పుడు లేదు. గతంలో మూవీ ఓపెనింగ్స్, ప్రమోషన్స్ చేయనంటూ బెట్టు చేసేది. మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చేది కాదు. నౌ ఆ రూల్స్ బ్రేక్ చేస్తోంది. కెరీర్ విషయంలో కూడా అంతే నేను లేడీ సూపర్ స్టార్‌ను కదా టైర్ 1 హీరోలతోనే జోడీ కడతానని గిరీగీసుకొని కూర్బోవట్లేదు. సీనియర్స్ సినీయర్సే జూనియర్స్ జూనియర్సే అంటోంది భామ. నయనతార పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో చాలా ఛేంజస్ కనిపిస్తున్నాయి. గతంలో యాడ్స్ చేసేది కాదు మూవీ ఓపెనింగ్స్‌కు వచ్చేది కాదు.. ప్రమోషన్స్ చేసేది కాదు. ఇక మీడియా ఇంటరాక్షన్ అంటే పూర్తిగా స్కిప్ చేసేది.
Also Read : Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
కానీ విఘ్నేశ్ శివన్ రాకతో ఆమెలో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న రూల్స్‌కు బ్రేక్ చేసి ఓపెనింగ్స్, ప్రమోషన్స్ చేస్తోంది. ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ స్కిప్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్ ఫ్యూచర్‌లో రీసెంట్లీ జరిగిన లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ ఆడియో ఫంక్షన్‌లా తళుక్కున మెరిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కెరీర్ పరంగా కూడా దూకుడు ప్రదర్శిస్తోంది లేడీ సూపర్ స్టార్. తాను స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయానని కేవలం టైర్ వన్ హీరోలతోనే జోడీ కడతానని భీష్మించుకోలేదు నయన్. ఒక వైపు సీనియర్స్‌తో జోడీ కడుతూనే మరో వైపు యంగ్ బాయ్స్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఇదే ఫార్ములాను వర్కౌట్ చేస్తోంది బ్యూటీ. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్‌తో పేట్రియాట్ చేస్తోన్న నయన్ తెలుగులో బాలకృష్ణ హిందీలో సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేయబోతుంది. బిగ్ బడ్జెట్ చిత్రాలు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటోన్న నయన్ లో బడ్జెట్, యంగ్ హీరోల చిత్రాలకు యస్ చెబుతోంది. యశ్ టాక్సిక్‌లో మెరవబోతున్న లేడీ సూపర్ స్టార్ కవిన్‌తో హాయ్, నివిన్ పౌలీతో డియర్ స్టూడెంట్స్ చేస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్ మూవీస్ వదిలిపెట్టడం లేదు. మూకుత్తి అమ్మన్ సీక్వెల్, రక్కాయ్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తోంది. ఇలా ఇయర్ బై ఇయర్ నయన్ తారలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక ఫ్యూచర్‌లో ఇంకెన్ని షేడ్స్ చూపించనుందో నయన్..? ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో నయన్ తార