Reading Time: < 1 minute
Miheeka Bajaj Interview Career Interior Design Moda Ngo No Movie Debut

Miheeka Bajaj: రానా దగ్గుబాటి భార్యగా మాత్రమే కాకుండా, ఒక ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆంత్రప్రెన్యూర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మిహీకా బజాజ్. తాజాగా ‘ఆర్ట్ కనెక్ట్’ వేదికగా ‘మైదా’ అనే ఆర్ట్ షోను ప్రారంభించిన ఆమె, తన కెరీర్, సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అక్కినేని-దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన కోడలిగా మీరు సినిమాల్లోకి వస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె కచ్చితంగా ‘లేదు’ అని సమాధానమిచ్చారు. “నాకు సినిమాలపై, నటీనటులపై గౌరవం ఉంది. కానీ నా ప్రపంచం కెమెరా వెనుక ఉంది. డిజైనింగ్ లోనే నేను నా సృజనాత్మకతను చూపిస్తాను. కథలు చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన నైపుణ్యం, అది తెలిసిన వారే చేయాలి” అని ఆమె స్పష్టం చేశారు.

READ ALSO: Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్

దగ్గుబాటి సురేష్ బాబు (మామగారు) గురించి మాట్లాడుతూ.. తమ ఇంట్లో డిన్నర్ టేబుల్ సంభాషణలన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతాయని చెప్పారు. “ఆయనకు సక్సెస్ ఉన్నా, ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తెలియని విషయం ఉంటే శ్రద్ధగా వింటారు” అని తన మామగారిలోని గొప్ప గుణాన్ని కొనియాడారు. పాండమిక్ తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడం గమనించి ‘మోడా’ అనే ఎన్జీవోను ప్రారంభించినట్లు మిహీకా తెలిపారు. “మోడా అంటే ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం అని అర్థం. ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రయాణంలో మాకు సహకరిస్తున్నారు” అని ఆమె తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

READ ALSO: Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!