Gold, Silver Price Today: గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా డాలర్ బలపడటం, పశ్చిమాసియాలో అనిశ్చితి పెరగడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. కామెక్స్ లో బంగారం ధర రూ. 1.21శాతం తగ్గి ఔన్సుకు 4, 821 డాలర్లకు చేరింది. వెండి ధర రూ. 2.05శాతం తగ్గి ఔన్సుకు 80.16 డాలర్లకు చేరుకుంది. అయితే మంగళవారం ధరలను పరిశీలిస్తే దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి.
ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,55,280కు చేరుకుంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,42,340కు చేరింది. 999శాతం స్వచ్ఛమైన వెండి ధర కిలోగ్రాముకు రూ. 2,74,90కి చేరింది. అక్షయ తృతీయ రోజున షాపులన్ని మహిళలతో కిటకిటలాడాయి. కొనుగోళ్లు కూడా భారీగా జరిగినట్లు బులియన్ మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.
ఇక హైదరాబాద్లో ఏప్రిల్ 21వ తేదీన 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,280 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,340, 18 క్యారెట్ల బంగారం: రూ.1,16,460, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,430 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,490 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,280 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,340 వద్ద ఉండగా, అదే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,990 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,990
ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతుండగా, అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది. గతంలో కిలో వెండి ధర ఏకంగా 4 లక్షల రూపాయల వరకు వెళ్లిగా ప్రస్తుతం చూస్తే భారీగా తగ్గిపోయింది. దాదాపు లక్ష రూపాయలకుపైగానే పడిపోయింది.




