అందమైన ఫ్లవర్ వాజ్: బల్బ్ పైభాగంలో ఉండే మెటల్ క్యాప్‌ను జాగ్రత్తగా తీసి, లోపలి భాగాలను తొలగించాలి. ఆ ఖాళీ బల్బులో నీటిని నింపి, చిన్న చిన్న మనీ ప్లాంట్లు లేదా పూల కొమ్మలను ఉంచవచ్చు. వీటిని ఒక స్టాండ్‌పై అమర్చినా లేదా దారంతో వేలాడదీసినా చాలా అందంగా కనిపిస్తాయి.
చిన్నపాటి టెర్రిరియం: బల్బ్ లోపల ఇసుక, చిన్న రాళ్లు, చిన్నపాటి ఇండోర్ మొక్కలను అమర్చి ఒక మినియేచర్ గార్డెన్ (Terrarium) తయారు చేయవచ్చు. ఇది మీ స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ డెస్క్ మీద ఉంచడానికి చాలా బాగుంటుంది.
కలర్ ఫుల్ డెకరేటివ్ పీసెస్: బల్బులపై విభిన్న రంగుల గ్లిట్టర్స్ లేదా గ్లాస్ పెయింట్స్ ఉపయోగించి చిత్రాలు వేయవచ్చు. వీటిని పండుగ సమయంలో గార్డెన్లో లేదా బాల్కనీలో వేలాడదీస్తే మీ ఇల్లు తళతళలాడుతుంది.
ఆయిల్ లాంప్స్ (నూనె దీపాలు): కొంచెం వెరైటీగా కావాలనుకుంటే, బల్బులో కిరోసిన్ లేదా నూనె పోసి వత్తిని అమర్చి దీపంలా వెలిగించవచ్చు. ఇది పాతకాలపు లాంతర్ల లుక్‌ను ఇస్తుంది.
పారేసే బల్బులను సరికొత్త మలచుకోని మీ డైనింగ్ టేబుల్‌పై సాల్ట్, సొంపు, ఇతర మసాలా దినుసులు భద్రపరిచే చిన్న కంటైనర్లగా కూడా మార్చుకోవచ్చు.వృథాగా పారేసే వస్తువులతో ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో మీ ఇల్లు అందంగా మారుతుంది.




