Gold, Silver Price Today: నిన్న అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. తర్వాత తులం బంగారంపై కేవలం 10 రూపాయాలు మాత్రమే తగ్గుముఖం పట్టింది. కానీ సోమవారం 9.30 గంటల సమయంలో తులం బంగారంపై భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 490 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,55,290 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై 360 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,42,350 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350 ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి విషయానికొస్తే..అతి స్వల్పంగానే తగ్గుముఖం పట్టింది. కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది. అదే హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది.
అదనపు ఛార్జీలు: పైన పేర్కొన్న ధరలు బులియన్ మార్కెట్ ధరలు మాత్రమే. మీరు నగలు కొనుగోలు చేసేటప్పుడు వీటికి GST (3%), మేకింగ్ ఛార్జీలు (తరుగు) అదనంగా ఉంటాయని గుర్తుంచుకోండి.
ధరల మార్పు: అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువపై ఆధారపడి ధరలు రోజులో ఎప్పుడైనా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు బంగారం కొనాలనుకుంటే హాల్మార్క్ (BIS Hallmark) ఉన్న నగలను మాత్రమే ఎంచుకోండి. ఇది మీరు కొనే బంగారం నాణ్యతకు గ్యారెంటీ ఇస్తుంది.





