Reading Time: < 1 minute
Deepika Padukone Pregnant For The Second Time How Will It Affect Allu Arjuns Raaka Shooting

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దీపికా రెండోసారి తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించింది. దీంతో అందరూ ర‌ణ్‌వీర్‌, దీపిక దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అదే సమయంలో ఆమె నటిస్తున్న సినిమాల పరిస్థితేంటి? అనే చర్చ మొదలైంది.

Also Read : Devara 2 : ఇంకెక్కడి దేవర 2.. కొరటాల కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్!

ముఖ్యంగా అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రాకాలో దీపికకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. లేదంటే.. త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేశాకే దీపిక ప్రెగ్నెంట్ అయిందా? లేక త‌న ప్రెగ్నెన్సీ సినిమాకు ఇబ్బందిగా మార‌బోతోందా? అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలిసిన విషయం ఏంటంటే.. దీపిక పోర్షన్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే, దీపిక ప్రెగ్నెన్సీ కావడంతో ఆమెకు సంబంధించిన పోర్షన్స్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయిందట చిత్ర యూనిట్. దీపికా ఈ సినిమాలో కేవలం గ్లామర్ కోసమే కాకుండా, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా కనిపించనుంది. దీంతో.. ఆమె గర్భం దాల్చకముందే కొన్ని హై ఇంటెన్సిటీ యాక్షన్ బ్లాక్స్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు మిగిలిన యాక్షన్ సీన్లను ముందుగా కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఆమె భద్రతకు మరియు సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకోనుంది దీపిక. మరి రాకాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.