మనం గుడికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే సాధారణంగా చేసే మొదటి పని కాళ్లు, చేతులు కడుక్కోవడం. కానీ, అలా చేయడం వల్ల మీరు గుడిలో పొందిన ఆ దైవిక శక్తిని కోల్పోతారని మీకు తెలుసా? దేవాలయంలోని పాజిటివ్ వైబ్రేషన్స్ మనల్ని అంటిపెట్టుకుని ఉండాలంటే వెంటనే నీటితో కడగకూడదని పండితులు చెబుతున్నారు. అసలు దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శక్తికి నిలయం దేవాలయం: మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే విగ్రహాలు, మంత్రోచ్ఛారణలు మరియు ధూపదీపాల వల్ల ఆ ప్రాంగణం అంతా ఒక రకమైన విద్యుదయస్కాంత శక్తితో నిండి ఉంటుంది.ఇక మనం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మన పాదాల ద్వారా, దైవ దర్శనం చేసుకున్నప్పుడు మన శరీరం ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది.
నీటితో కడిగేస్తే ఏమవుతుంది?: శాస్త్రం ప్రకారం, గుడి నుంచి రాగానే వెంటనే కాళ్లు కడగడం వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తుడిచిపెట్టుకుపోతాయి. గుడిలో లభించిన ఆ ప్రశాంతత, దైవిక శక్తి మన శరీరంలో నిక్షిప్తం కావడానికి కొంత సమయం పడుతుంది. ఇక అందుకే ఇంటికి రాగానే కనీసం 15 నుండి 20 నిమిషాల వరకు కాళ్లు కడగకుండా ఉండటమే మంచిదని పెద్దలు చెప్తారు.

పాదరక్షల విషయంలో జాగ్రత్త: చాలామంది గుడి బయట వదిలేసిన చెప్పులను వేసుకుని ఇంటికి వస్తారు కాబట్టి కాళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని భావిస్తారు. ఇక ఒకవేళ మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తే లేదా ఏదైనా ఆహారం తీసుకోవాల్సి వస్తే కేవలం చేతులు కడుక్కుంటే సరిపోతుంది. కానీ పాదాలను మాత్రం వెంటనే తడపకపోవడమే శ్రేయస్కరం.
కాసేపు కూర్చోవడం ముఖ్యం: పూర్వకాలం నుండి ఒక ఆచారం ఉంది. గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. ఇక దీనివల్ల గుడిలో మనం పొందిన మానసిక ప్రశాంతత మనసులో స్థిరంగా ఉండిపోతుంది. హడావిడిగా పనుల్లో పడిపోకుండా ఆ దైవ చింతనలో కొద్దిసేపు గడపడం వల్ల ఆరోగ్యం, ప్రశాంతత రెండూ లభిస్తాయి.
భక్తి అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దాని వెనుక ఎంతో సైన్స్ కూడా దాగి ఉంది. కాబట్టి వచ్చేసారి మీరు గుడికి వెళ్లి వచ్చినప్పుడు, ఆ దైవిక శక్తి మీతోనే ఉండేలా చూసుకోండి. కాసేపు వేచి ఉండి, ఆ తర్వాతే మీ దైనందిన పనులు మొదలుపెట్టండి. ఈ చిన్న మార్పు మీ మనసుకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
The post ఆలయం వెళ్లి వచ్చాక ఈ పని చేయొద్దట.. పండితుల సూచన appeared first on Manalokam – Latest Telugu News & Updates.