Reading Time: 2 minutes
Pokiri: ఎన్నాళ్లకు కనిపించింది మావ..! పోకిరి రౌడీ గర్ల్ ఎంత మారిపోయింది..!!

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారాణసి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ నటిస్తుంది. ఉంటే మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా పోకిరి. మహేష్ బాబు కెరీర్ ను మలుపుతిప్పి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అప్పటివరకు అభిమానులు చూసిన మహేష్ వేరు.. పోకిరి సినిమాలో మహేష్ బాబు వేరు. పోకిరి సినిమాలో మహేష్ బాబు లుక్స్ , డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన మొదటి సినిమా ఇది. ఇక ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి.

మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు

ఇక ఈ సినిమాలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా..? విలన్ గ్యాంగ్ లో ఉండే యువతిగా కనిపించి మెప్పించింది ఆమె. ఈ అమ్మడు పేరు జ్యోతి రానా. బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన ఈచిన్నది సినిమాలో కనిపించేది కొంచెం సేపే అయినా కూడా ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమా తర్వాత జ్యోతి ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. బాంబే లో పుట్టి పెరిగిన ఈమె అక్కడ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు

పోకిరి సినిమాతో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ వచ్చినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ తీసుకొని యోగ క్లాస్ లు చెప్తుంది. సర్టిఫైడ్ యోగ ఇన్స్ట్రక్టర్ గా కూడా రాణిస్తుంది జ్యోతి. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలావుందో తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. దాంతో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జ్యోతి నిత్యం యోగ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Sheeva (Jyoti) Rana 🕊🧿 (@sheeva_rana)

ఆయన్ని ఇలా చూస్తే ప్రాణం చివ్వుక్కుమంది..! నడవలేని స్థితిలో లెజెండ్రీ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.