ప్రతి పూజా కార్యక్రమంలో పూలు తప్పనిసరి. పూలు దేవునికి అర్పించే అత్యంత అందమైన కానుకగా చెప్పాలి.. పూలు దేవతలను ప్రసన్నం చేస్తాయని భక్తుల విశ్వాసం. పూలు శుద్ధి , సాత్వికతకు ప్రతీకగా పిలుస్తారు. పూజలో పూలు ఉపయోగించడం వల్ల వాతావరణం శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా పూలు శుభానికి ప్రతీక. పూజలో పూలు ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. అలాంటి పూలలో బంతి పూలు ఒకటి. సనాతన ధర్మంలో బంతి పూలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. వీటిలోని పసుపు, నారింజ రంగులు సానుకూల శక్తికి, సమృద్ధికి చిహ్నాలు.
వినాయకుడు (బుధవారం): వినాయకుడికి బంతి పూలు అంటే చాలా ఇష్టం. బుధవారాల్లో గణేశుడిని పూజించి, బంతి పువ్వులను సమర్పించండి. గణేశుడు అత్యంత సంతోషిస్తాడు. ఇది జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది. మీకు జ్ఞానమనే వరం లభిస్తుంది. మీ పనిలోని అడ్డంకులు తొలగిపోతాయి. గణేశుడికి బంతి పువ్వులను సమర్పించడం అనేది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఒక సులభమైన మార్గం. బుధవారం నాడు గణపతిని బంతి పూలతో పూజిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది.
లక్ష్మీదేవి (శుక్రవారం): లక్ష్మీదేవికి బంతిపూలను సమర్పించడం వల్ల జీవితంలో సానుకూలత ఏర్పడి, ధన సంపాదనకు అనేక మార్గాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవికి తాజా బంతి పువ్వులను సమర్పించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. లక్ష్మీదేవికి బంతి పూల మాలలు సమర్పించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ పూలతో పూజించడం వల్ల దారిద్య్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
మహావిష్ణువు (గురువారం): విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే పరమ ప్రీతి. గురువారం నాడు విష్ణువుకు బంతి పూలు అర్పించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది మరియు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. గురువారం నాడు శ్రీ హరివిష్ణువు విగ్రహం ముందు పసుపు రంగు బంతిపూలను సమర్పించండం చాలా శుభప్రదంగా భావిస్తారు.
శుభకార్యాల్లో ప్రాముఖ్యత: ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా పండుగ వచ్చినా గుమ్మానికి బంతి పూల తోరణాలు కడతారు. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఇంటికి వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకుని, సానుకూలతను నింపడానికి తోడ్పడుతుంది. దేవుడికి భక్తితో ఒక చిన్న బంతి పువ్వు సమర్పించినా అది మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. అందుకే మీ దైనందిన పూజలో ఈ పవిత్రమైన పూలను ఉపయోగించండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి (Jupiter) గ్రహంతో ముడిపడి ఉంది. ఈ పూలు ముఖ్యంగా వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి. బుధవారం నాడు గణపతికి బంతి పూలు సమర్పించడం వల్ల బుద్ధి వికాసం చెందుతుందని, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని అంటారు.. శుక్రవారం లక్ష్మీదేవికి ఈ పూలు అర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, గురువారం విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల జ్ఞానం, సంతాన సుఖం కలుగుతాయని జ్యోతిశాస్త్రం చెబుతోంది. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా సాగడానికి బంతి పూల మాలలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.





