ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాల కంటే, డబ్బుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే, అతనికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. అయితే దీని గురించి చాణక్యుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా భవిష్యత్తు కోసం తప్పకుండా మనీ పొదుపు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. చాణక్యుడు తన నీతి శాస్త్రం పుస్తకంలో దీని గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.
ఆయన చెబుతూ.. సంపదను ఎప్పుడూ కూడా అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవాలి. ఎప్పుడు ఏ కష్టం ఎదురు అవుతుందో ఎవరూ చెప్పలేరు, కష్టాలు వచ్చినప్పుడు ధనవంతుడు అనేది ఉండదు, ఎందుకంటే లక్ష్మీ దేవి చంచలమైనది, ఎప్పుడు ఎక్కడికి వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని సార్లు కూడబెట్టింది కూడా నశించి పోతుంది. అందుకే ఎంత ధనవంతుడైనా, ఇంటినిండా సంపద ఉన్నా కొన్ని సార్లు అంతా కోల్పోయి కష్టాల బారిన పడే పరిస్థితి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువలన సంపదను ఈ రోజు కోసం కాకుండా, భవిష్యత్తు కోసం ఎప్పుడూ కూడా దాచుకోవాలి.
అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా సంభవించవచ్చు. ఇటువంటి సందర్భంలో మన దాచిన డబ్బే మనకు ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు ఏదో ఒక కారణం చేత మన సంపద నశించి పోతుంది. అప్పుడు మనం దాచిన పొదుపే మనకు ఒక మార్గాన్ని చూపెడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా డబ్బును పొదుపు చేసుకోవాలి. అది ఏదో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు చాలా మేలు చేస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.
అందువలన మీ వీలును బట్టి రోజు లేదా వారం, లేదా నెల, మీకు వీలును బట్టి, సంవత్సరానికి కొంత డబ్బును పొదుపు చేసుకోవడం వలన అది మీకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ వివేకానికి సంకేతం. అందుకే చేతి నిండా సంపాదించినప్పుడే ఖర్చులను తగ్గించుకొని, ఎక్కువగా పొదుపు చేస్తూ రావాలి. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు మిమ్మల్ని తీవ్రమైన సమస్య నుంచి రక్షిస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు.
ఆ చార్య చాణక్యుడు చెబుతూ , డబ్బు చాలా అవసరం, అలాగే అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా అవసరం అవుతుంది. అందుకే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని, ప్రతి రోజూ తప్పకుండా కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. అందుకే డబ్బు పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం అని చాణక్య నీతి చెప్తుంది.




