Reading Time: < 1 minute
Tollywood Box Office Crisis No Major Hits In Last 3 Months And Ustaad Bhagat Singh Disaster

సంక్రాంతి సినిమాల తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద కరువు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. మధ్యలో ‘మన శంకరవరప్రసాద్‌’, ‘నారీ నారీ’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు కొంతవరకు లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ అవి ఇండస్ట్రీకి కావాల్సిన అసలైన ఊపును తీసుకురాలేకపోయాయి. వీకెండ్స్‌లో కూడా థియేటర్లు ఖాళీగా కనిపిస్తుండటం ఎగ్జిబిటర్లను కలవరపెడుతోంది.

Also Read : RAAKA : రాకా.. హీరోయిన్ పరిస్థితేంటి?

సాధారణంగా సమ్మర్ అంటే పెద్ద సినిమాల జాతర ఉంటుంది. కానీ ఈ ఏడాది సమ్మర్‌లో పెద్ద సినిమాలు ఏవీ కనుచూపు మేరలో లేవు. సమ్మర్ రేసులో వచ్చిన ఏకైక స్టార్ మూవీ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా నిలవడం టాలీవుడ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రేటింగ్స్ బాగానే ఉన్నప్పటికీ ‘బైకర్’, ‘డెకాయిట్’ వంటి చిత్రాలు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి. సినిమా బాగుందని టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది చేదు నిజం. ఈ వైఫల్యానికి ప్రధాన కారణాల్లో IPL 2026 ఒకటిగా కనిపిస్తోంది. క్రికెట్ ఫీవర్ వల్ల ప్రేక్షకులు సాయంత్రం వేళల్లో థియేటర్ల కంటే టీవీలకే పరిమితమవుతున్నారు. దీనికి తోడు పెరిగిన టికెట్ ధరలు, ఓటీటీల ప్రభావం థియేటర్ల వైపు జనాన్ని రాకుండా చేస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నిర్వహణ భారమై రాష్ట్రవ్యాప్తంగా చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉంది. ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకోవాలంటే త్వరలో రాబోయే భారీ ప్రాజెక్టులపైనే అందరి ఆశలు ఉన్నాయి.