మీ జీవితంలో అనుకోకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏం చేసినా అందులో ఏవైనా ఇబ్బందులు, పనులు ఆలస్యం, ఒక పని చేయాలి అనుకునేలోపే అది కాస్త మధ్యలోనే ఆగిపోవడం, ఎప్పుడూ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరగడం, మానసిక అశాంతి ఉంటే తప్పకుండా ఇది నర దిష్టి ప్రభావమే అంటున్నారు పండితులు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పకుండా దృష్టిదోషం తగ్గించుకోవాలంట. దీని కోసం మంగళ వారం ఈ సింపుల్ చిట్కాలు పాటించాలంట.
నరదిష్టి అంటే ఒక వ్యక్తి అసూయ చూపు, అయితే ఇది ఎవరి మీద అయితే ఉంటుందో, వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఒత్తిడి అధికం అవుతుంది, ప్రతి కూల సంఘటనలు జరుగుతాయి. సమయం సందర్భం లేకుండా ఇంటిలో గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇలా జరిగితే మీ పై ప్రతికూల శక్తి ప్రభావం ఉన్నట్లేనంట, ఇంటువంటి సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున కొన్ని పనులు చేయాలంట. దీని వలన హనుమంతుడి అనుగ్రహం కలిగి , నర దిష్టి కూడా పోతుందంట.
హనుమంతుడిని పూజించడం, వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరు అయితే హనుమంతుడిని పూజిస్తారో వారిపై ఎలాంటి ప్రతికూల శక్తి పని చేయదంట. అందువలన ఈ రోజు తప్పకుండా ఉదయాన్నే స్నానం చేసి, దీపం వెలిగించి, హనుమంతుడిని పూజించాలి. ఇలా చేయడం వలన క్రమంగా మీపై ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుంది.
అదే విధంగా ఈ రోజు రాత్రి ఒక నిమ్మకాయను తీసుకొని మీ పై నుంచి ఏడు సార్లు తిప్పి, మూడు దారులు కలిసే చోట వేయాలి. దీని వలన కూడా దిష్టి దోషం తొలిగిపోతుందంట. అంతే కాకుండా, ప్రతి మంగళ వారం ఇంటి ప్రధాన ద్వారానికి ఒక నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు గుచ్చి దానిని ఇంటికి వేలాడదీయాలి. తర్వాతి మంగళవారం వాటిని మార్చాలి. ఇలా ఏడు వారాలు చేస్తే చెడు దిష్టి పోతుంది.
అదే విధంగా మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం, అలాగే చేతి మణికట్టుకు ఎరుపు రంగు దారం ధరించడం వలన కూడా నరదిష్టి నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు. అయితే ఈ దారం కట్టుకునే సమయంలో సమస్యలన్నీ తొలిగిపోవాలని దేవుడిని ప్రార్థించాలంట. ఇలా చేయడం వలన సమస్యలన్నీ త్వరగా పోతాయంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




