Reading Time: < 1 minute
Chandrababu Naidu Nda Rule Tamil Nadu Development Election Campaign Chennai

CM Chandrababu Naidu: ఎన్డీఏ పాలన వస్తేనే తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. చెన్నై సాత్తూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. సాత్తూర్ లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశమై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ పాలన అధికారంలోకి రావాలని, వారికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో 2019-24 మధ్య విధ్వంసం జరిగింది. మేం అధికారంలోకి వచ్చాక కేంద్రం సహకారంతో రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. తమిళనాడుకు ఉజ్వల భవిష్యత్ కావాలంటే ఎన్డీఏ అభ్యర్ధులు గెలిచి తీరాలన్నారు. మధురై ఏపీలోని రాయలసీమ తరహా ప్రాంతం అని.. చాలా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు.

READ MORE: Kedarnath: కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!

అభివృద్ధికి మారుపేరు ఎన్డీఏ ప్రభుత్వమే అని సీఎం చంద్రబాబు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎన్డీఏ పాలన రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, కేరళ అంతా ద్రవిడ ప్రాంతానికి చెందిన వారమే అన్నారు. చెన్నైకి తెలుగు గంగ ద్వారా తాగునీటిని ఇచ్చిన నేతగా ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజలు తమ ఓటు ద్వారా తమిళనాడు భవిష్యత్తును మార్చాల్సి ఉందన్నారు. గతంలో చెన్నై దక్షిణ భారతదేశానికి అత్యంత కీలకమైన ప్రాంతమని.. ఇప్పుడు చెన్నై అభివృద్ధి శూన్యమన్నారు. ఇప్పుడు మళ్లీ దానిని పునరుద్ధరించే బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుందని.. ఎన్డీఏ అభ్యర్ధులను గెలిపిస్తే తమిళనాడు ప్రజలు గెలిచినట్టేనన్నారు.

READ MORE: India Heatwave 2026: వేడికి కేరాఫ్ అడ్రస్ భారత్.. ప్రపంచంలోని టాప్ 20 హాటెస్ట్ ప్లేస్‌లలో 19 మనవే..