
Rishabh Pant One handed six Video: ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాంశ్ ఆర్య, కూపర్ కోనోలీ మెరుపు దాడితో పంజాబ్ జట్టు ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. అనంతరం 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి 6 ఓవర్లలో వీరిద్దరూ 61 పరుగులు జోడించారు. బదోని అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్, మొదటి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించాడు.
ఒంటిచేత్తో సిక్సర్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఊచకోత..
లక్నో ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌కు రాగా, పంత్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఆ ఓవర్ నాలుగో, ఐదో బంతులను పంత్ వరుసగా సిక్సర్లుగా మలిచాడు. ముఖ్యంగా ఐదో బంతికి పంత్ తన ట్రేడ్‌మార్క్ ‘వన్ హ్యాండెడ్’ (ఒంటిచేతి) షాట్‌తో కొట్టిన సిక్సర్ స్టేడియంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. తనదైన విలక్షణమైన శైలిలో శరీరాన్ని తిప్పుతూ కొట్టిన ఆ షాట్ బంతిని గాలిలోకి పంపిన తీరు అద్భుతం. ఈ ఓవర్లో లక్నో జట్టు మొత్తం 15 పరుగులు రాబట్టింది.
79 మీటర్ల దూరం..
Vintage Rishabh Pant making it look completely effortless
Make sure you wait for that trademark one-handed maximum at the end!
Updates
https://t.co/u5eUR1eqdA#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @LucknowIPL pic.twitter.com/UZobI2Qhxm
— IndianPremierLeague (@IPL) April 19, 2026
రిషబ్ పంత్ బాదిన మొదటి సిక్సర్ 79 మీటర్ల దూరం పడగా, రెండో సిక్సర్ ఏకంగా 89 మీటర్ల దూరం వెళ్లి పడింది. మార్కో జాన్సెన్ వేసిన ఆ ఓవర్లో మొదటి మూడు బంతులకు సింగిల్స్ రాగా, ఆ తర్వాత పంత్ తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పంత్, ఈ మ్యాచ్‌లో తన పాత ఫామ్‌ను గుర్తుకు తెచ్చాడు. పంత్ ఆడిన ఆ అరుదైన షాట్ వీడియో ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.
పోరాడినా దక్కని విజయం..
పంత్ మెరుపులు మెరిపించినప్పటికీ, పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో లక్నో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయినప్పటికీ, పంత్ బాదిన ఆ సిక్సర్లు అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Make sure you wait for that trademark one-handed maximum at the end! 