Reading Time: < 1 minute
Fbi Director Kash Patel Files 250m Defamation Lawsuit Against The Atlantic

అగ్ర రాజ్యం అమెరికాలో ఎఫ్‌బీఐ అనేది ఒక ప్రధానమైన దర్యాప్తు సంస్థ. అమెరికాలో అంతర్గత భద్రత, ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, తీవ్రమైన నేరాలపై దర్యాప్తు చేసే అతిముఖ్యమైన సంస్థ. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఈ సంస్థ డైరెక్టర్‌గా భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్‌ను డైరెక్టర్‌గా నియమించారు. కానీ కాష్ పటేల్‌ మాత్రం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. ఆ మధ్య ప్రియురాలి సంగీత కచేరీకి జెట్ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా దర్యాప్తులో కూడా నత్తనడక ప్రదర్శిస్తారంటూ విమర్శలు ఉన్నాయి.

తాజాగా మరో వివాదం సంచలనంగా మారింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అతిగా మద్యం సేవిస్తారంటూ ‘‘ది అట్లాంటిక్ పత్రిక’’ తన కథనంలో పేర్కొంది. అతిగా మద్యం సేవించడం కారణంగా ముఖ్యమైన విచారణలకు గైర్హాజరు అవుతారని తన కథనంలో హైలెట్ చేసింది.

దీంతో ‘‘ది అట్లాంటిక్ పత్రిక’’ కథనంపై కాష్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా కథనం ప్రచురించిందని.. అదొక తప్పుడు కథనం అని మండిపడ్డారు. దీంతో పత్రికపై, జర్నలిస్ట్ సారా ఫిట్జ్‌ప్యాట్రిక్‌పై 250 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీ ప్రకారం రూ.2300కోట్లు) పరువు నష్టం దావా వేశారు.

కాష్ పటేల్..
కాష్ పటేల్ ఫిబ్రవరి 2025 నుంచి ఎఫ్‌బీఐ చీఫ్‌గా ఉన్నారు. గతంలో కూడా మీడియాపై దావాలు వేశారు. ఇది రెండవ పరువు నష్టం కేసు. ఈ కేసు వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టులో విచారణకు రానుంది.

Fbi