Reading Time: < 1 minute
Viral Video: ఏసీ ఆన్‌చేయగానే అదోరకం శబ్ధాలు.. టెక్నీషియన్‌ను పిలిపించి ఓపెన్ చేయించగా..

ఏసీ ఆన్‌ చేద్దామని వెళ్లగా అందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పాములు దర్శనమిచ్చిన ఘటన తిరువనంతపురంలోని శ్రీకార్యంలో వెలుగు చూసింది. చెరువక్కల్ ప్రాంతానికి చెందిన టెక్నోపార్క్ ఉద్యోగి మాధవ్ పనికర్ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన మాధవ్, బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఏసీ ఆన్‌ చేద్దాం అనుకున్నాడు. అయితే అతని ఏసీ అడుగుభాగంలో ఏదో బయటకు పాకుతున్న దృశ్యం కనిపించింది. దీంతో ఏంటా అని దగ్గరకు వెళ్లి పరిశీలించగా అక్కడ పాము కనిపించింది. అంతే అది చూసిన మాధవ్ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.

వెంటనే అక్కడి నుంచి వెనక్కి వచ్చి అటవీ శాఖ అధికారులతో పాటు ఏసీ టెక్నీషియన్‌కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న ఏసీ టెక్నీషియన్, అటవీశాఖ అధికారులు.. జాగ్రత్తగా ఏసీని ఓపెన్ చేశారు. అయితే అందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పాముల ఫ్యామిలీనే అంటే ఐదు పాములు కనిపించాయి. ఇక చాలా జాగ్రత్తగా నాలుగు పాములను బంధించగా, ఒకటి మాత్రం అదే రంధ్రం గుండా తప్పించుకుంది.

ఇక ఏసీలోంచి తీసిన పాములను జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. అయితే ఏసీలోని నీరు బయటకు వెళ్లే పైపు కోసం గోడకు చేసిన రంధ్రం ద్వారానే ఈ పాములు లోపలికి వచ్చి ఉంటాయని లేదా బాల్కనీకి ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మల సాయంతో గోడపైకి ప్రాకి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

వీడియో చూడండి..

 

View this post on Instagram

 

A post shared by The South First (@thesouthfirsttsf)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.