Reading Time: < 1 minute
Miheeka Bajaj Reveals Special Gift From Rana Daggubati Interview Highlights

Miheeka Bajaj: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్యగా అందరికీ సుపరిచితురాలైన మిహీకా బజాజ్, సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు. అయితే తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రానాతో ఉన్న బంధం, తన ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు అత్యంత ప్రియమైన వస్తువు ఏది అని అడిగినప్పుడు మిహీకా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “రానా, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొత్తలో ఆయన నాకు ఒక చిన్న ‘యోడా’ బొమ్మను బహుమతిగా ఇచ్చారు. తన దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయని, తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి రెండోది ఇద్దామని ఎప్పటి నుంచో దాచుకున్నానని చెప్పారు. ఆ బొమ్మ నా దగ్గర ఉన్న అన్నిటికంటే చాలా విలువైనది” అని ఆమె మురిసిపోతూ చెప్పారు.

READ ALSO: KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే

రానా, తన వ్యక్తిత్వాల గురించి చెబుతూ.. ఇద్దరూ ధనుస్సు రాశి వారేనని, కళలు, డిజైన్ అంటే ఇద్దరికీ అమితమైన ఇష్టమని తెలిపారు. ముఖ్యంగా తమ మధ్య ఎప్పుడూ ‘డ్రామా’ ఉండదని, ఇద్దరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటామని ఆమె వివరించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు తనను ‘వదినా’ అని పిలవడంపై మిహీకా స్పందిస్తూ.. అది రానా మీద ఉన్న ప్రేమతోనే వాళ్లు అలా పిలుస్తారని, ఆ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు. సోషల్ మీడియాలో నెగటివిటీ కంటే తనకు పాజిటివిటీనే ఎక్కువగా కనిపిస్తుందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

READ ALSO: Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!