సజ్జ పిండి అట్టుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సజ్జ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి
అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర కట్ట కొత్తిమీర, రెండు గ్లాసుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి ఇంకా దీనిని బెల్లంతో కూడా తీసుకోవచ్చు.
ముందుగా పిండిని ఇలా కలుపుకోవాలి: మీరు ముందుగా సజ్జ పిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసి దానిలో కొద్దిగా బియ్యం పిండిని కలపాలి. ఇంకా దీనిలో ఉప్పును కూడా వేసి వేడి నీళ్లు పోసి అట్టు పిండికంటే పలుచగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే అట్టు కూడా మెత్తగా వస్తుంది. ముఖ్యంగా పళ్ళులేని ముసలివాళ్ళకు తినడానికి మంచిగా ఉంటుంది.
జీర్ణమయ్యే పదార్థాలను కూడా వేయండి: ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్ ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే, ఇవి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి అలాగే, టేస్ట్ ను కూడా ఇది పెంచుతుంది.
పిండిని 15 నిముషాల పాటు పక్కన పెట్టండి: ఈ పిండి మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇలా చేయడం వలన పిండి తేలికగా అయ్యి అట్టు మెత్తగా కూడా వస్తుంది. ఆ తరవాత పాన్‌ను తీసుకుని దాని మీద ఆయిల్ వేసి
పిండిని దోశ లాగా పోసుకోవాలి.
మరి ఎక్కువగా కాల్చకండి. ఇది మీడియం మంటపై స్లోగా వేయించాలి. ఇంకా మీకు మెత్తగా రావాలంటే పాన్ మీద మూతపెట్టి ఉడికిస్తే మెత్తగా తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా దీనిని తిప్పి కాల్చుకోవాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు పళ్ళు లేని వాళ్లకి తినడానికి టేస్టీగా ఉంటుంది.




