
IPL 2026 : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ వెనుక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మంత్రం ఏదో పనిచేసినట్లు కనిపిస్తోంది. మైదానంలో వీరిద్దరి మధ్య జరిగిన సీరియస్ సంభాషణ, ఆ తర్వాత తిలక్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. అయితే, ఈ సీన్ లోని గాంభీర్యాన్ని పక్కన పెట్టి, కొందరు యువకులు దీన్ని అత్యంత సరదాగా రీక్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ మధ్యలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. ఒకానొక దశలో నెమ్మదిగా ఆడుతున్న తిలక్ వద్దకు వచ్చిన హార్దిక్, ఏదో సీరియస్‌గా చెబుతూ మోటివేట్ చేయడం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ చర్చ జరిగిన మరుక్షణం నుండే తిలక్ వర్మ గేర్ మార్చి స్టేడియంను సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ మార్పు చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ సీన్‌ను కొందరు యువకులు తమదైన శైలిలో రీక్రియేట్ చేశారు. హార్దిక్ పాండ్యా చేతులు ఊపుతూ సీరియస్‌గా మాట్లాడటం, తిలక్ వర్మ శ్రద్ధగా వినడం.. ఆ తర్వాత బ్యాట్‌తో ఊచకోత కోస్తుంటే హార్దిక్ పక్కనే నిలబడి ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎంకరేజ్ చేయడం వంటి దృశ్యాలను అచ్చం మ్యాచ్‌లో జరిగినట్లే షూట్ చేశారు. ఈ వీడియోలో కుర్రాళ్ల ఎక్స్‌ప్రెషన్లు ఒరిజినల్ ప్లేయర్ల కంటే అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “హార్దిక్ తమ్ముడు ఏమైనా నీలో ఉన్నాడా?” అని ఒకరు, “తిలక్ వర్మ సెంచరీ వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా?” అని మరొకరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ రీక్రియేషన్ వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. కేవలం సరదా కోసం చేసినప్పటికీ, మైదానంలోని ఒత్తిడిని మరియు ఆటగాళ్ల మధ్య ఉన్న బాండింగ్‌ను ఈ వీడియో చక్కగా ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Tilak-ன் சரமாரி தாக்குதலுக்கு முன் Captain Pandya-வின் Motivational Talk!
தொடர்ந்து காணுங்கள் | TATA IPL 2026 | #GTvMI | JioHotstar & Star Sports 1 தமிழில்#TATAIPL #TATAIPL2026 pic.twitter.com/pOqwasXawU
— Star Sports Tamil (@StarSportsTamil) April 20, 2026
Tag that MI fans
MI comeback kuduthutanda
just for fun
#lungiboys #rajpriyan #lungiboyscomedy pic.twitter.com/OJ4UmcaE25
— Lungi boys (@rajpriyan007) April 20, 2026
తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్, హార్దిక్ పాండ్యా నాయకత్వ పటిమపై ఈ వీడియో ద్వారా మరోసారి చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్, తిలక్ ఇన్నింగ్స్ సమయంలో ఎంకరేజ్ చేసిన తీరు జట్టు సభ్యుల మధ్య ఉన్న ఐక్యతను చాటిచెప్పింది. ఈ క్రేజీ వీడియో ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. క్రికెట్ అభిమానులు ఈ స్పూఫ్‌ను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


தொடர்ந்து காணுங்கள் | TATA IPL 2026 |
MI comeback kuduthutanda
just for fun 