
Ajith Kumar: సినిమాలతో పాటు మోటార్‌స్పోర్ట్స్ పై తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉన్న ఇష్టం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరేశాడు. బెల్జియంలోని ప్రఖ్యాత సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్ (Circuit de Spa-Francorchamps) ట్రాక్ పై జరిగిన 24H సిరీస్ రేసులో ఆయన టీమ్ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానం (P2) సాధించింది. ఈ విజయంతో అజిత్ రేసింగ్ టీమ్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Preity Zinta Hug: యాహూ.. ప్రీతి జింటా హగ్ ఇచ్చిందోచ్.. టీమిండియా స్టార్ పేసర్ సంతోషం!
ఈ ఎండ్యూరెన్స్ రేస్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీలలో ఒకటి. 24 గంటల పాటు నిరంతరంగా జరిగే ఈ రేసులో టీమ్ వర్క్, ఫోకస్, స్టామినా ఎంతో అవసరం. అలాంటి పోటీలో అజిత్ కుమార్ టీమ్ రెండో స్థానం సాధించడం గొప్ప విజయంగా భావించవచ్చు. అంతర్జాతీయ అనుభవం ఉన్న జట్లతో పోటీ పడుతూ ఈ ఫలితం సాధించడం నిజంగా గొప్ప విషయమే. రేస్ అనంతరం పోడియంపై అజిత్ కుమార్ భారత జెండాను ఎగురవేస్తూ సంబరాలు జరుపుకున్న క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రోఫీతో పాటు జెండాను పట్టుకుని టీమ్ తో కలిసి సెలబ్రేట్ చేసిన ఆయన విజయం కేవలం వ్యక్తిగత గెలుపు మాత్రమే కాకుండా దేశ గర్వంగా మారింది.

యూనివర్స్ బాస్ Chris Gayle మరో అడుగు.. ఆ జట్టుకు సహాయజమానిగా కొత్త ప్రయాణం..!
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తరువాత రేసింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన ఆయన, స్వంతంగా రేసింగ్ టీమ్ ఏర్పాటు చేసి యూరప్ లోని పలు దేశాల్లో పోటీల్లో పాల్గొంటున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, యూకే, పోర్చుగల్ వంటి దేశాల్లో ఆయన రేసింగ్ షెడ్యూల్ కొనసాగుతోంది. ఇప్పటికే యూరోపియన్ సిరీస్ లలో మంచి ప్రదర్శనలు చేసిన అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ తన గుర్తింపును పెంచుకుంటోంది. క్రమంగా మెరుగైన ఫలితాలు సాధిస్తూ అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ లో ప్రముఖ స్థానం సంపాదిస్తోంది.