
గత వారం బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలా గత వారమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సైకో కిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తోంది. అంతకు ముందే ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగానే అలరించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనెగుడ్ల అనే ఊరి పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. మెడకు, చేతులకు గొలుసులు కట్టి అతి దారుణంగా చంపేస్తుంటారు. దీంతో ఊరి ప్రజలు భయటకు వెళ్లాలంటేనే వణికిపోతుంటారు. ఈ సీరియల్ మర్డర్స్ ను ఛేదించడానికి సీతారాం అనే ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఈ బ్రూటల్ మర్డర్స్ వెనుక ఓ సైకో ఉన్నాడని దర్యాప్తులో తెలుసుకుంటాడు. మరి అసలు గ్రామంలో హత్యలు చేస్తుంది ఎవరు? సైకో కిల్లర్ ఉద్దేశమేంటి? అతనిని సీతారాం ఎలా పట్టుకున్నాడు? అన్న ప్రశ్నలకు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
ఈ సినిమా పేరు ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’. ఇదొక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. గతంలో వచ్చిన సీతారాం బెనోయ్ కేస్ నెం.18 మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. దేవి ప్రసాద్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ రాఘవేంద్ర, గోపాల్ దేశ్ పాండే, ఉష భండారి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లైయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెలర్స్ బ్యానర్‌పై దేవి ప్రసాద్, సాత్విక్ హెబ్బర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం కన్నడ, తమిళ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడే ఈ సినిమాను చూడాలనుకునేవారు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఎంజాయ్ చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
All thanks to your love
Second Case of Seetharam trending TOP #3 in India
2.5 Crore minutes streamed in 3 days!
Streaming now on @PrimeVideo#SecondCaseOfSeetharam #VijayaRaghavendra #PavanWadeyar #DeviPrasadShetty #LahariMusic pic.twitter.com/vKepZoU3Ex
— Lahari Music (@LahariMusic) April 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



2.5 Crore minutes streamed in 3 days!