పచ్చి మిర్చి తొక్కు, కోడిగుడ్డుకు కావలసిన పదార్థాలు: ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి, నాలుగు కోడిగుడ్లు, 150 గ్రాములు ఉల్లిపాయలు, ఆరు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు , అర టేబుల్ స్పూన్ పసుపు, మంట సరిపోకపోతే కొద్దిగా కారం కూడా తీసుకోండి , మూడు టేబుల్ స్పూన్స్ నూనె , పడు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.
ఇలా అన్నింటిని సిద్ధం చేసుకోవాలి: ముందుగా మీరు పచ్చిమిర్చిని తీసుకుని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
కారం మేము తినలేము అనుకున్న వాళ్లు గింజలు తీసి తింటే మంచిది. ఇంకోవైపు వెల్లుల్లి, ఉల్లిని రోకలితో నూరి రెడీ చేసుకోవాలి.
కోడిగుడ్లను తీసుకుని ఒక గిన్నెలో బ్రేక్ చేసి పెట్టుకోవాలి.
ఇలా తాలింపు పెట్టుకోవాలి: ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది బాగా వేడి అయ్యాక కరివేపాకును కూడా వేసి బాగా వేయించాలి. దానిని నూరిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బంగారు రంగులోకి మారే వరకు దానిని బాగా వేయించాలి. ఈ సమయంలోనే మంచి వాసన వస్తుంది.
పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి: ఇప్పుడు దీనిలో ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా దీనిలో వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. అప్పుడు అది గట్టిగా అవుతుంది, ఆ తరవాత మూతపెట్టి 10 నిముషాల పాటు ఉడికిస్తే అది మెత్తగా అవుతుంది. ఇంకా కలుపుతూ ఉంటె అడుగు అంటకుండా ఉంటుంది.
ఇప్పుడు గుడ్ల మిశ్రమాన్ని ఈ పాన్‌లో వేసి ఒక స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. ఇది మిర్చితో కలిసేపోయే వరకు దానిని బాగా కలుపుతూ మీడియం మంటపై ఉంచితే మెత్తగా అవుతుంది. ఆ తరవాత దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.
మీకు మరింత టేస్ట్ కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు.




