
PF ఖాతాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ విత్ డ్రా విధానంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక మార్పులు తీసుకొస్తుంది. పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు ఫ్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ లో అనేక మార్పులు చేస్తోంది.ఈక్రమంలో EPFO 3.0 కు సంబంధించి కీలక అప్డేట్స్ అందించింది.
EPFO 3.0 అనేది ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్‌లో రాబోయే పెద్ద అప్‌డేట్.2026 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సిస్టమ్ ద్వారా మన పీఎఫ్ ను ATMలు ,UPI ద్వారా తక్షణ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంత మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు.కనీసం 25శాతం బ్యాలెన్స్‌ను ప్రదర్శిస్తుంది.
దీంతోపాటు కొత్త పోర్టల్, ప్రాంతీయ భాషల్లో AI ఆధారిత సేవలను అందించబోతోంది. సులభమైన క్లెయిమ్ ప్రాసెసింగ్, వర్నక్యులర్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు మెరుగైన, డిజిటల్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ALSO READ : వీకెండ్ ఆఫీసుకు రాలేదని.. ఉద్యోగిని పీకేసిన స్టార్టప్ కంపెనీ
EPFO 3.0 విధానం అమలు 2026లో మొదటి వార్షిక పీరియడ్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. వీటితోపాటు సర్వీస్ పీరియడ్ తగ్గించడం, విత్‌డ్రా పరిమితులు సడలించడం వంటి నిబంధనల సవరణలు కూడా ఉండనున్నాయి.
AI ద్వారా ప్రాంతీయ భాషలో సేవలు
EPFO 3.0 లో భాగంగా ఖాతాదారులకు AI ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. AI ఆధారిత పరికరాలతో ప్రాంతీయ భాషల్లో కమ్యూనికేట్ చేయనున్నారు. భాషిణి అనే AI ఆధారిత ట్రాన్స్ లేటర్ తో సేవలందించనున్నారు.
యూపీఐ ద్వారా PF విత్ డ్రాలు..
ఇప్పటివరకు మనం పీఎఫ్ ను EPFO ఆఫీసులు, ఆన్ లైన్ ద్వారా విత్ డ్రా చేసుకుంటున్నాం.. అయితే ఇకపై యూపీఐ ద్వారా కూడా ప్రావిడెంట్ ఫండ్ ను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. BHIM యాప్ ఉపయోగించి UPI ద్వారా పీఎఫ్ నిధులను విత్ డ్రా లు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
ప్రావిడెంట్ ఫండ్ సేవలను బ్యాకింగ్ తరహాలో అందించడం, ప్రాంతీయభాషలలో సేవలు, వేగంగా, స్కేలబుల్ గా మార్చడం EPFO 3.0 లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుత ఖాతాదారులు, రాబోయే సంవత్సరాల్లో ఖాతాదారులుగా చేరే లక్షలాది మంది ఖాతాదారులకు సేవలను గణనీయంగా మెరుగుపర్చనుంది.