Reading Time: < 1 minute

NLSIU రీసెర్చ్ ఫెలోషిప్స్ .. నెలకు రూ.2 లక్షల స్టైపెండ్.. అప్లయ్ చేసుకోండిలా ‘

Caption of Image.

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తులను ఆహ్వానించింది. అకడమిక్, ప్రొఫెషనల్ పరిశోధకులు ఈ ఫెలోషిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. న్యాయం, సామాజిక శాస్త్రాలు, పబ్లిక్ పాలసీ తదితర విభాగాల్లో పరిశోధనకు అవకాశం ఉంటుంది.

జనవరి 2027 ఇన్‌టేక్ కోసం NLSIU మూడు ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. వీటిలో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌లో 10 సీట్లు, పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌లో 5 సీట్లు, యూనివర్సిటీ రీసెర్చ్ ఫెలోషిప్‌లో 5 సీట్లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 30, 2026 సాయంత్రం 5 గంటలు.

విద్యార్హతలు.. 

గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు .. లా గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సోషల్ సైన్సెస్, పబ్లిక్ పాలసీ, సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉండాలి. 
పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌కు.. గత మూడేళ్లలో లా, సోషల్ సైన్సెస్, పబ్లిక్ పాలసీ లేదా సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి.
యూనివర్సిటీ రీసెర్చ్ ఫెలోషిప్‌కు.. గుర్తింపు పొందిన పీహెచ్‌డీతో పాటు కనీసం 10 ఏళ్ల బోధన లేదా సంబంధిత వృత్తిపరమైన అనుభవం, మంచి పరిశోధనా ప్రచురణల రికార్డు అవసరం.

నెలవారీ వేతనం(స్టైపెండ్).. 

గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు రూ.50,000 
పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌కు రూ.1.20 లక్షలు
పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌కు రూ.2 లక్షలు

ఎంపికైన వారు సాధారణంగా బెంగళూరులోని NLSIU క్యాంపస్‌లో ఉండి పరిశోధన చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను NLSIU అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలి.

►ALSO READ | డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ పోస్టులు.. ఇంజినీరింగ్ చేసినోళ్లకు సూపర్ ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే!

©️ VIL Media Pvt Ltd.