Reading Time: 2 minutes

24 గంటల్లోనే 3 మ్యాచ్‌లు.. ఆసియా గేమ్స్ నుంచి వైదొలగడంపై పీవీ సింధు కామెంట్స్ వైరల్!

Caption of Image.

3 Matches in 24 Hours: జపాన్ (Japan) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026)లో భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి రావడంపై ఆమె ఆసియా గేమ్స్ నిర్వాహకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన రికవరీ సమయం (Recovery time) ఇవ్వకుండా ఈ విధంగా షెడ్యూల్ చేయడం సరికాదని మండిపడ్డారు.

24 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. రికవరీ కష్టం: సింధు 

శనివారం (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం తన రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సింధు, ఆ తర్వాత రాత్రి (ఆదివారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో) మూడో రౌండ్ మ్యాచ్ ముగించారు. ఆ వెంటనే ఈరోజు (ఆదివారం, సెప్టెంబర్ 27) మధ్యాహ్నం 1:30 గంటలకు చైనా (China) స్టార్ చెన్ యుఫే (Chen Yufei)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ (Quarter-final) మ్యాచ్‌లో బరిలోకి దిగి ఓడిపోయింది. 

ఈ బిజీ షెడ్యూల్‌పై పీవీ సింధు మాట్లాడుతూ.. ఆసియా గేమ్స్ ని అంత బాగా ఆర్గనైజ్ చేయలేదు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకుని, ఉదయమే వచ్చి మళ్లీ మ్యాచ్ ఆడటం చాలా కష్టం.. ఆటలో ఫిజికల్ రికవరీ అనేది చాలా ముఖ్యం. సుదీర్ఘ మ్యాచులు ఆడిన తర్వాత కాళ్లు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. 

హాక్-ఐ లేకపోవడం వల్లే నష్టం: పీవీ సింధు

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కొన్ని కీలకమైన లైన్ కాల్స్ (Line calls) తనకు వ్యతిరేకంగా వెళ్లాయని, కానీ కోర్ట్ 4 (Court 4)లో హాక్-ఐ కెమెరాలు లేకపోవడంతో తాను ఏమీ చేయలేకపోయానని పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. ఐచినోమియా జిమ్నాసియం హాల్‌లోని షో కోర్ట్స్ 1, 2లలో మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేశారని, క్వార్టర్ ఫైనల్స్ లాంటి కీలక మ్యాచ్‌లలో అన్ని కోర్టుల్లోనూ కెమెరాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. రివ్యూ (Player challenge) కోరే ఛాన్స్ లేకపోవడంతో ప్రత్యర్థిపై లభించాల్సిన అడ్వంటేజ్ కోల్పోయామని సింధు వెల్లడించింది. 

►ALSO READ | హైజంప్‌లో సర్వేశ్‌కు.. లాంగ్‌జంప్‌లో ఆన్సీకూ గోల్డ్ మిస్.. రజతంతోనే సరి!

2030 ఆసియా క్రీడలలో ఆడటంపై సింధు క్లారిటీ: 

భవిష్యత్తులో జరిగే 2030 ఆసియా క్రీడలలో (2030 Asian Games) తాను పాల్గొనే అంశంపై సింధు తన మనసులోని మాట బయటపెట్టారు. నాలో సత్తా ఉండి, గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉంటే కచ్చితంగా ఆడతాను. కానీ, ఇప్పుడు నా వయసు 20 ఏళ్లు కాదు, కాబట్టి శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏ టోర్నమెంట్ ఆడాలి, దేన్ని పక్కన పెట్టాలనే దానిపై ప్రణాళిక వేసుకుంటానని తెలిపింది. పతకాలతో సంబంధం లేకుండా బ్యాడ్మింటన్ అంటే తనకు ఉన్న ఇష్టమే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తోందని పీవీ సింధు వెల్లడించింది.  

©️ VIL Media Pvt Ltd.