Reading Time: < 1 minute

ట్యాంక్‌బండ్‎పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుడి నామస్మరణతో దద్దరిల్లుతోన్న ట్యాంక్ బండ్

Caption of Image.

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. నిమజ్జనానికి వినాయక విగ్రహాలు భారీగా తరలివస్తున్నాయి. దీంతో ప్రధాన మార్గాల్లో భక్తుల రద్దీ పెరుగుతోంది. 

చిన్న, మధ్యతరహా గణపతి విగ్రహాలతో పాటు భారీ ప్రతిమలు సైతం నిమజ్జనానికి తరలివస్తున్నాయి. నిమజ్జన ప్రాంతాల్లో భక్తుల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. రద్దీకి అనుగుణంగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక బారికేడ్లు, ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాటు చేశారు. 

నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో పోలీసుల నిరంతర పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.  నిమజ్జనానికి వచ్చే వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్ రూట్ కాకుండా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.

 

©️ VIL Media Pvt Ltd.