Reading Time: < 1 minute

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూసారాంబాగ్ హై-లెవెల్ బ్రిడ్జి ప్రారంభం

Caption of Image.

హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యంగా అంబర్‌పేట్, మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజలకు రవాణా కష్టాలు తీరాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మూసారంబాగ్ హై-లెవెల్ బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మూసీ నదిపై జీహెచ్ఎంసీ (GHMC) నిర్మించిన ఈ కొత్త వంతెనను సీఎం  రేవంత్ రెడ్డి  ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 52 కోట్ల రూపాయల వ్యయంతో.. 400 మీటర్ల పొడవుతో, అత్యాధునికంగా 3 లైన్ల హై-లెవెల్ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. గత ప్రభుత్వం హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో.. రాకపోకలు సాగించలేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఈ హై-లెవెల్ బ్రిడ్జి ప్రారంభం కావడంతో అంబర్‌పేట్ – మూసారంబాగ్ మధ్య కనెక్టివిటీ మరింత సులభతరమైంది. ట్రాఫిక్ జామ్ సమస్యలకు చెక్ పడటంతో పాటు, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.

 

©️ VIL Media Pvt Ltd.