Reading Time: < 1 minute

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు

Caption of Image.

హైదరాబాద్: సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అధికారుల తనిఖీల్లో విస్తూపోయే విషయాలు బయటపడ్డాయి. రెస్టారెంట్‌లో తీవ్ర పారిశుద్ధ్య లోపాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వంటశాలలో ఈగల బెడదతో పాటు లేబుళ్లు లేకుండా ఆహార పదార్థాల నిల్వ చేసినట్లు గుర్తించారు. కిచెన్‎లో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలు నిల్వ చేశారు. ఫ్రిజ్‎లు అపరిశుభ్రంగా ఉన్నాయి. అలాగే, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ సర్టిఫికెట్లు లేవు. నీటి నాణ్యత పరీక్ష నివేదికలు కూడా అందుబాటులో లేవని గుర్తించారు అధికారులు. అపరిశుభ్ర ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోన్న రెస్టారెంట్‎కి అధికారులు నోటీసులు ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.