Reading Time: < 1 minute

ఉప్పల్ వాసులకు అలర్ట్..జూలై27న ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Caption of Image.

ఉప్పల్ ప్రాంత ప్రజలకు కీలక  అప్డేట్..జూలై 27న ఉప్పల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటిసరఫరా అంతరాయం ఏర్పడనుంది. ఉప్పల్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల కారణంగా ఆ రోజు మొత్తం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.  నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. 

ఉప్పల్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ P15  ఫౌండేషన్ పనులు వల్ల అక్కడి తాగునీటి పైప్ లైన్ కుఅంతరాయం ఏర్పడింది. దీంతో నాచారం, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. 

అదేవిధంగా  ఫతేనగర్, హస్మత్ పేట్, ప్రకాశ్ నగర్, హెచ్ ఎంటీనగర్ లకు కూడా నీటి సరఫరా బంద్ కానుంది. వీటితోపాటు సీతాఫల్ మండి, మెట్టుగూడ, లాలాపేట్, నార్త్ లాలాగూడ ప్రాంతాల్లో కూడి వాటర్ సప్లయ్ నిలిచిపోనుంది. 

మరోవైపు బాలానగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎంఈఎస్  ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. 

©️ VIL Media Pvt Ltd.