Reading Time: < 1 minute

సేమ్ సీన్ రిపీట్.. భువనగిరిలో బాలుడిపై వీధికుక్క దాడి..కుడికంటి భాగంలో గాయాలు

Caption of Image.

యాదాద్రి భువనగిరి జిల్లాలో వీధికుక్కలు రెచ్చిపోయాయి.  భువనగిరిలో బాలుడిపై  వీధికుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడికి తల, కంటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం భువనగిరి జిల్లా  ఆస్పత్రికి తరలించారు.. గతంలో కూడా ఇలాంటి సంఘటనే  భువనగిరిలో జరిగింది. వీధికుక్కల దాడులతో  స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. 

శుక్రవారం (మే 29) భువనగిరి పట్టణంలోని 26వ వార్డు లో ఉంటున్న హర్ష అనే బాలుడిపై వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడిలో బాలుడి కుడి కన్నుకు తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యలు, స్థానికులు కుక్కు తరిమి బాలుడిని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గత మార్చినెలలో కూడా ప్రియాంశ్ అనే బాలుడిని  వీధికుక్క కరవడంతో కంటిని కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. 

©️ VIL Media Pvt Ltd.