Reading Time: 2 minutes
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి సూపర్ న్యూస్.. ప్రూఫ్ లేకపోయినా అడ్రస్ మార్చుకోవచ్చు.. ఎలా అంటే..?

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్ ఆధార్. ఇది లేనిది దేశంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు, సేవలు పొందలేము. ఇది ఒక తప్పనిసరిగా డాక్యుమెంట్‌గా మారిపోయింది. అందుకే ఆధార్ కార్డులోని వివరాలు అన్నీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరముంది. మీరు ఇల్లు మారినప్పుడు అడ్రస్ అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. అదే అడ్రస్ వేరేచోట ఉంటే మీరు పలు సేవలు పొందటంలో ఇబ్బందులు పడే అవకాశముంది. ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే అడ్రస్ ప్రూఫ్ అవసరమవుతుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా ధృవీకరణ కోసం ఇతర పత్రాలు అప్‌లోడ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రూఫ్ లేని సమయంలో ఆధార్ కార్డులో అడ్రస్‌ను అప్డేట్ చేసుకోవడం వినియోగదారులు కష్టతరంగా మారుతుంది. ఈ సమస్యను తొలగించేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రూఫ్ లేకపోయినా ఈ కొత్త ఆప్షన్ ద్వారా మీరు సులువుగా ఆన్‌లైన్ విధానంలో అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం.

అడ్రస్ ప్రూప్ అవసరం లేదు

మీ కుటుంబ పెద్ద ఆధార్ వివరాల ఆధారంగా మీరు ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు. అయితే ఇందుకు కుటుంబ పెద్ద ఆన్‌లైన్‌లో తన సమ్మతి తెలపాల్సి ఉంటుంది. ఈ విధానంలో మీరు ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం మీ కుటుంబ పెద్ద మీకు అనుమతి ఇస్తే సరిపోతుంది. దీంతో వారి ఆధార్ కార్డులోని అడ్రస్ మీ కార్డులో కూడా అప్డేట్ అవుతుంది. అడ్రస్ అప్డేట్ కోసం ప్రూఫ్ సమర్పించలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సులువుగా అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ ఈ సదుపాయం తీసుకొచ్చింది.

ఎలా అప్డేట్ చేసుకోవాలి..?

-యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి లాగిన్ అవ్వండి

-అడ్రస్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోండి

-ఫ్యామిలీ హెడ్ బేస్డ్ అడ్రస్ అప్డేట్ ఎంచుకోండి

-కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

-కుటుంబపెద్దతో సంబంధాన్ని నిర్ధారించేందుకు రేషన్ కార్డు, పాస్ పోర్ట్, మార్క్ షీట్ లాంటి డాక్యుమెంట్స్ అందింవచ్చు

-కుటుంబపెద్దతో మీ సంబంధాన్ని తెలిపే పత్రం అప్ లోడ్ చేయండి

-రూ.50 ఫీజు చెల్లించండి

-ఆ తర్వాత సబ్మిట్ చేయండి

-రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకోండి

-రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

-30 రోజుల్లోపు మీ ఆధార్‌లో అడ్రస్ అప్డేట్ అవుతుంది.

-30 రోజుల్లోగా అవ్వకపోతే మీ దరఖాస్తు ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతుంది.