Reading Time: < 1 minute
కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్ హ్యాపీ!

రోడ్డు ప్రయాణాల్లో అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏదైనా ఉందంటే అది సరైన సమయంలో వాష్‌రూమ్ దొరకకపోవడమే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు చైనా ఈవీ దిగ్గజం సెరెర్స్ (Seres) ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చింది. కారు లోపలే మొబైల్ టాయిలెట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ సెరెర్స్ (Seres) కార్లలో ప్రయాణించే వారికి ఒక విప్లవాత్మకమైన సదుపాయాన్ని తీసుకురాబోతోంది. సుదీర్ఘ ప్రయాణాల్లో (Long Road Trips) టాయిలెట్ సమస్యను పరిష్కరించేందుకు కారు లోపలే ఒక ఇన్-కార్ టాయిలెట్ సిస్టమ్ (In-Car Toilet System) ను రూపొందించి, దానికి సంబంధించిన పేటెంట్‌ను పొందింది.

సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?:

ఈ ఇన్-కార్ టాయిలెట్ సాధారణ సీటులాగే కనిపిస్తుంది. కానీ సీటు కింద ఒక అధునాతన టాయిలెట్ యూనిట్ దాగి ఉంటుంది. ప్రయాణికులు ఒక బటన్ నొక్కడం ద్వారా లేదా వాయిస్ కమాండ్ ద్వారా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. రైలు మెకానిజం సాయంతో సీటు కింద నుండి టాయిలెట్ కమోడ్ స్లైడ్ అవుతూ బయటకు వస్తుంది. కారు వంటి తక్కువ స్థలం ఉండే వాహనాల్లో టాయిలెట్ అంటే వాసన ప్రధాన సమస్య. దీనిని నివారించడానికి కంపెనీ శక్తివంతమైన ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ప్రత్యేక గాలి శుద్ధీకరణ వ్యవస్థను రూపొందించింది. ఇది వాసనను వెంటనే కారు నుండి బయటకు పంపేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Av News (@_av_news_)

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?:

సెరెర్స్ కంపెనీ ఈ పేటెంట్‌ను ఏప్రిల్ 2025లో ఫైల్ చేయగా ఏప్రిల్ 2026లో దీనికి అధికారిక ఆమోదం లభించింది. ప్రస్తుతం ఇది పేటెంట్ దశలో మాత్రమే ఉంది. అయితే, సెరెర్స్ కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ముఖ్యంగా AITO బ్రాండ్ కార్లలో) త్వరలోనే ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని వాహన రంగ నిపుణులు భావిస్తున్నారు. కార్లలో ఇప్పటికే మసాజ్ సీట్లు, ఫ్రిజ్‌లు వంటి లగ్జరీ ఫీచర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇన్-కార్ టాయిలెట్ కూడా జతకూడితే ప్రయాణీకుల అసౌకర్యానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అయితే, సామాన్య ప్రజలు ఈ ఫీచర్‌ను ఎంతవరకు ఆహ్వానిస్తారనేది వేచి చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..