Reading Time: < 1 minute
W, W, W, W, W, W.. అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి పెవిలియన్ చేరారు..

ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ, అంచనాలకు అందని ట్విస్టులు. కానీ ఈ 2026 సీజన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీజన్ మొదలై 25 రోజులు గడుస్తున్నా, ఈ దిగ్గజ జట్లు ఇంకా ఫామ్‌ అందుకోవడానికి కష్టపడుతున్నాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం, ఈ రెండు జట్లు ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి.. ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ప్లేఆఫ్స్ చేరాలంటే ఒక జట్టుకు కనీసం 16 పాయింట్లు అవసరం. అంటే, మిగిలి ఉన్న ఎనిమిది మ్యాచ్‌లలో ఈ జట్లు కనీసం ఆరు విజయాలు సాధించాలి.

ముంబై బౌలింగ్ సమస్యలతో సతమతమవుతుంటే, చెన్నై జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ముఖ్యంగా కీలక ఆటగాడు ఆయుష్ మాత్రే దూరం కావడం CSK ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాయి. ఇలాంటి స్థితిలో పాత ఛాంపియన్లు పుంజుకోవడం ఒక అసాధారణ సవాలుతో కూడుకున్న పని. అయితే, ఏప్రిల్ 23న వాంఖడే వేదికగా ముంబై, చెన్నై మధ్య జరగబోయే 33వ మ్యాచ్ ఈ రెండు జట్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఈ “ఎల్ క్లాసికో” పోరులో గెలిచిన జట్టుకు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టుకు మాత్రం దారులు దాదాపు మూసుకుపోయినట్లే. మరి ఈ గడ్డు కాలాన్ని దాటి చెన్నై, ముంబై జట్లు మళ్లీ సింహ గర్జన చేస్తాయో లేదో వేచి చూడాలి.

ఇది చదవండి: ధోని, కోహ్లీ, రోహిత్ ‘ఎవడైతే నాకేంటి’.. 14 ఫోర్లు, 14 సిక్సర్లతో తొక్కుకుంటూ పోతున్న సర్పంచ్ సాబ్..