డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతం చేసేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ ఇ-మాండేట్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇక నుంచి కొత్త కార్డు పొందినప్పుడు పాత కార్డుపై ఉన్న ఇ- మాండేట్ చెల్లింపులు కొత్త కార్డుకు ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. ఇ-మాండేట్ చెల్లింపులను సులభతరం చేయడం, సురక్షితంగా కస్టమర్లు నిర్వహించేందుకు ఆర్బీఐ ఈ రూల్స్ ప్రవేశపెట్టింది.
ఈ కొత్త నిబంధనలకు సంబంధించి ఓ ప్రకటన కూడా జారీ చేసింది. కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఇ-మాండేట్ నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు చేసింది. ఆటోమేటిక్ చెల్లింపులకు కస్టమర్‌కు నోటిఫికేషన్ పంపినప్పుడల్లా ఫిర్యాదును ఎలా నమోదు చేయాలనే పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు చేసింది. అలాగే ఆటోమేటెడ్ చెల్లింపులపై ఆర్బీఐ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.
నెలకు రూ.15 వేల వరకు జరిగే ఆటోమేటిక్ చెల్లింపులకు ఎలాంటి ఓటీపీ, పాస్ వర్డ్ అవసరం లేదని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఇంతకంటే ఎక్కువ పేమెంట్స్‌కు మాత్రమే ఓటీపీ లేదా పాస్ వర్డ్ ధృవీకరణ అవసరమవుతుందని స్పష్టం చేసింది. ఇక ఓటీసీ సబ్స్క్రిప్షన్లు, కరెంట్ బిల్లుల చెల్లింపుల కోసం ఇ-మాండేట్ ఎంచుకున్న వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేదా రుసుములు వసూలు చేయవద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
ఇక ఇ-మాండేట్ ట్రన్సాక్షన్లకు సంబంధించి వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది. ఇక ఇన్యూరెన్స్ ప్రీమియంలు, మ్యూచవల్ ఫండ్స్ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకు ఓటీపీ లేకుండా రూ.లక్ష వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత వేగంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడనున్నాయి.
డిజిటల్ చెల్లింపులు ఇటీవల పెరిగిపోయాయి. ప్రతీఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో నెట్, మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ సౌకర్యాన్ని ఎక్కకుమంది ఉపయోగించుకుంటున్నారు. ఈ విధానాల ద్వారా డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటివరకు పేమెంట్స్ కోసం ఓటీపీ ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి రూ.15 వేలలోపు చేసే చెల్లింపులకు అవసరం లేకపోవడం వల్ల వేగంగా లావాదేవీలు చేయవచ్చు




