Reading Time: < 1 minute

Jr NTR Emotional: ‘మా అమ్మకు మరో కొడుకు పుట్టి ఉంటే అతనే కార్తికేయ’.. జక్కన్న కొడుకుపై ఎన్టీఆర్ ఎమోషనల్!

Caption of Image.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన మనసులోని మాటలను బయటపెట్టారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్‌లో పాల్గొన్న తారక్.. రాజమౌళి తనయుడు కార్తికేయతో తనకున్న బాండింగ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కార్తికేయ తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదని.. సొంత తమ్ముడిలాంటి వాడని చెప్పుకొచ్చారు.

“మీరు నా శక్తి అయితే.. నాకు దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న, కీరవాణి ఫ్యామిలీ. రాజమౌళి కొడుకు కార్తికేయ నాకు సొంత తమ్ముడిలాంటి వాడు. మా అమ్మగారికి ఇంకో కొడుకు పుట్టి ఉంటే.. అతను కార్తికేయే. ఆ ప్లేస్‌లో ఇంకెవరికీ ఆప్షన్ లేదు” అంటూ తారక్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తన ఫెయిల్యూర్ టైమ్‌లో అభిమానులతో పాటు కార్తికేయ కూడా తనకు అండగా నిలిచాడని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ‘బాహుబలి’, ‘RRR’ వంటి సినిమాల సక్సెస్ వెనుక కార్తికేయ కృషి ఉందని చెప్పారు. తన ముఖంపై కనిపించిన ప్రతి చిరునవ్వు వెనుక కార్తికేయ ఉన్నాడని.. కళ్ల వెంట కన్నీళ్లు వచ్చినప్పుడు వాటిని తుడిచేందుకు కూడా అతను వెన్నంటే ఉన్నాడని ఎమోషనల్‌గా మాట్లాడారు.

►ALSO READ | Jr NTR: ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్.. తారక్ స్పీచ్‌లో హైలైట్స్ ఇవే

“చాలా సరదాగా ఉండటానికి ఈవెంట్‌కు వచ్చాను. కానీ కార్తికేయ నన్ను ఎమోషనల్ చేసేశాడు” అంటూ తారక్ చెప్పడంతో ఈవెంట్‌లో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది.

చివరగా నిర్మాతగా కార్తికేయను సపోర్ట్ చేస్తూ.. “మన కార్తికేయ తమ్ముడిని గెలిపిద్దాం” అంటూ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తారక్ స్పీచ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్నదమ్ముల్లాంటి ఎన్టీఆర్–కార్తికేయ బాండింగ్‌పై అభిమానులు ప్రేమను కురిపిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.